🔴 ఆదివాసీలకు అటవీ హక్కుల పత్రాలు జారీ చేయాలి…..
🔴 2018 టీఆర్టీ నియామకాలు ఆపాలి…
🔴 ఆదివాసీ బంధు పథకం ప్రారంభించి, ప్రతి ఆదివాసీకి పది లక్షలు ఇవ్వాలి….
తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు డిమాండ్లతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందించిన 9 తెగల ఆదివాసీ నాయకులు
రిపబ్లిక్ హిందుస్థాన్,ఆదిలాబాద్ :
ఆదివాసీ నాయకులు మరో ఉద్యమానికి సిద్ధం అవుతున్నారు. ఆదివారం రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం లో తొమ్మిది తెగల ఆదివాసీ నాయకుల ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ కోసం సమావేశం నిర్వహించారు.
ఆదివాసీ భవన్ పిట్టలవాడ యందు ఆదివారం ఏర్పాటు చేసిన ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గోడం గణేష్ అధ్యక్షాన సమావేశం నిర్వహించారు . ఈ సమావేశంలో వివిద మండల తుడుందెబ్బ నాయకులు మరియు ఉద్యోగులు, ఆదివాసీ తోమ్మిది తెగల నాయకులు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు, గ్రామ పటేల్ లు, మహజన్ లు,తదితరులు పాల్గొన్నా ఈ సమావేశం లో ముందుగా ఆదివాసీ హక్కుల సాధన కోసం ఉద్యమా కార్యచరణ పై చర్చించారు.
అనంతరం ఉద్యమ తిర్మనం చేసి,ఆ తీర్మానాన్ని ఆమోదించారు,
భవిష్యత్ ఉద్యమ ఎజెండాను రూపొందించారు. ఉద్యమ ఎజెండా లో ముఖ్యం లంబాడాలను ఎస్టీ జాబితా నుండీ తొలగించాలని తీర్మానం చేశారు. ఆదివాసులకు అటవీహక్కుల పత్రాలు ఇవ్వాలని, జివో ఎంఎస్3 ను అమలు చేయాలి, 2018 వ సంవత్సరం లో జరిగిన టీఆర్టీ నియామకాలు ఆపాలి, ఆదివాసీలకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలి, ఆదివాసీల కోసం ‘ఆదివాసీబంధు’ అమలు చేసి ఆ పథకం కింద పది లక్షలు ప్రతి ఆదివాసీ కి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా జివో ఎంఎస్ నెం.317 ను 5వ షేడ్యూల్ ప్రాంతంలో రద్దు చేయాలి, నాన్ ఏజెన్సీ గ్రామాలు ఏజెన్సీ గ్రామాలు గా గుర్తించాలి, ఈ డిమాండ్ల పై
దశల వారిగా ఉద్యమాలు చేయడం జరుగుతుంది అని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ నాయకులు పుర్క బాపురావ్ కొడప సోనేరావు, కుంర జంగు, గేడం మనోహర్, ఉయక సుదర్శనం,నైతం సూర్యభాన్ , మడావి కేశవ్, టేకం లక్ష్మణ్, ఆత్రం బాలేరావు, తొడసం ఇస్త్రీ, సిడం రామ్ కిషన్, పూసం ఆనంద్ రావ్, కుర్సెంగా తానాజీ, మెస్రం గంగాదేవి, ఆత్రం అనసూయ, గోడం రేణుక బాయి, కుంర గణేష్, నైతం రమేష్, వెట్టి మనోజ్ మరియు ఆదివాసీ తుడుం దెబ్బ నాయకులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments