- మట్కా, గుట్కా, జూదం గంజాయి లాంటి వాటిని ఉపేక్షించేది లేదు. జైనథ్ మండలం బోరజ్ వద్ద 280 రాయితీ బియ్యం స్వాధీనం.
- ఆదిలాబాద్ డిఎస్పి కి వచ్చిన సమాచారంతో దాడి. జైనత్ నందు కేసు నమోదు.
- ఆసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం
— జైనథ్ సీఐ డి సాయినాథ్
ఆదిలాబాద్: జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపాలనే జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఆదిలాబాద్ డిఎస్పిఎల్ జీవన్ రెడ్డి గారికి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు బోరజ్ చెక్పోస్ట్ నందు పిడిఎస్ రైస్ రాయితీ బియ్యం తరలిస్తున్నారని సమాచారంతో జైనథ్ సిఐ మరియు జైనథ్ ఎస్సై తనిఖీలు నిర్వహించగా, ఆ రాయితీ బియ్యం నిర్మల్ నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లాకు తరలిస్తున్నారు అని తెలిసింది, ఇవి దాదాపు 280 క్వింటల్లు ఉంటాయని జైనథ్ సిఐ తెలిపారు. జైనథ్ పోలీస్ స్టేషన్ నందు విచారణ చేపట్టగా నిర్మల్ లోని అన్నపూర్ణ రైస్ మిల్ ట్రేడర్స్ వద్ద నుండి మహారాష్ట్రలోని గొండియా జిల్లా విలాస్ రైస్ మిల్లుకు తరలిస్తున్నారని డ్రైవర్ తెలపగా వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని జైనథ్ డి సాయినాథ్ తెలిపారు. తదుపరి ఈ బియ్యాన్ని సివిల్ సప్లై అధికారికి అందజేయడం జరిగింది. అసాంఘిక కార్యకలాపాలన రూపుమాపడానికి తనదైన శైలిలో విధులను నిర్వర్తిస్తున్న ఆదిలాబాద్ డిఎస్పి గారిని జైనథ్ సిఐ మరియు ఎస్ఐలను జిల్లా ఎస్పీ అభినందించారు.
Recent Comments