రిపబ్లిక్ హిందూస్థాన్ , ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడా రానున్న రెండు రోజుల్లో మోస్తరు వర్షాలతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డా. శ్రీధర్ చౌహన్ తెలిపారు.
రానున్న రోజుల్లో వాతావరణం ఇలా ఉంటుంది.
ఆదిలాబాద్ జిల్లా వాతావరణ సూచన …
వాతావరణ సూచన తేది : 22.09.2021 భారతీయ వాతావరణ విభాగం , ప్రాంతీయ కేంద్రం , హైదరాబాద్ ( తెలంగాణా ) వారి సూచన ప్రకారము ఆదిలాబాద్ జిల్లాలో రాబోయే 4 రోజులలో ( 23.09.2021 నుండి 26.09.2021 వరకు ) ఆకాశము మధ్యస్థంగా మేఘావృతమై ఉండును . 23 వ తేదిన 48 మి.మీ ; 24 వ తేదిన 28 మి.మీ .; 25 వ తేదిన 34 మి.మీ మరియు 26 వ తేదిన 26 మి.మీ.ల వర్షపాతము ( ఓ మోస్తారు వర్ష సూచన ) నమోదు కావచ్చును . గాలి గరిష్ట ఉష్ణోగ్రత 30-32 డిగ్రీ సెంటీగ్రేడు గాను మరియు కనిష్ట ఉష్ణోగ్రత 22-23 డిగ్రీల సెంటీగ్రేడుగా నమోదు కావచ్చును . గాలిలో తేమ ఉదయం పూట 90-95 % గాను మరియు మధ్యాహ్నం పూట 65-81 % వరకు ఉండగలదు . నైరుతి దిశగా గంటకు 6-10 కి.మీ.ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉంది . 22-23 న జిల్లాలో ఒకటి రెండు ప్రదేశాలలో భారీ వర్షం వచ్చే అవకాశం కలదు .


Recent Comments