🔶 ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ బస్టాప్ వద్ద డ్రైవర్లకు ట్రాఫిక్ నియమాల పై అవహగానా
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ప్రజలందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలని ఉద్దేశంతో ట్రాఫిక్ సీఐ కే మల్లేష్ ఆధ్వర్యంలోని బృందం శుక్రవారం రొజు స్థానిక ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ బస్ స్టాప్ నందు ట్రాఫిక్ నియమ నిబంధనలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆటో డ్రైవర్ల కు, ప్రజలకు తాగి వాహనాలు నడవదని, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని, సక్రమంగా ప్రతి ఒక్కరు లైసెన్స్ ను కలిగి ఉండాలని, ద్విచక్ర వాహనాలు దారులు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, ఫోర్ వీలర్స్ సీట్ బెల్ట్ ను వేసుకొని డ్రైవింగ్ చేయాలని, తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ జి అప్పారావు, ఏఎస్ఐ రామారావు, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments