రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సోమవారం స్థానిక పోలీసు ముఖ్య కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి ట్రాఫిక్ సిఐ ఎం అశోక్ బాధ్యతలు స్వీకరించారు.
ట్రాఫిక్ సిఐ ఎం అశోక్ 2009 సంవత్సరంలో పోలీస్ డిపార్ట్మెంట్ లోకి అడుగుపెట్టి 2020 సంవత్సరంలో సీఐగా పదోన్నతి పొంది స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో నందు విధులు నిర్వహించారు. సోమవారం రోజు ట్రాఫిక్ సిఐ గా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం మల్టీ జోన్ వన్ ఐ జి ఎస్ చంద్రశేఖర్ ఉత్తర్వుల మేరకు జిల్లా ఎస్పీకి రిపోర్టు చేయడం జరిగిందని సిఐ తెలిపారు.
Recent Comments