దాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకూడదు…..
Thank you for reading this post, don't forget to subscribe!మద్యం సేవించి వాహనాలు నడపకూడదు….
జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను నియంత్రించాలి….
ఇచ్చోడా, నేరడిగొండ, సిరికొండ పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ….
గంజాయి, మత్తు పదార్థాలను పూర్తిస్థాయిలో అరికట్టాలి….
— జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్
అదిలాబాద్ : జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదాలను పూర్తిగా అరికట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ తెలిపారు. ఈరోజు ఇచ్చోడ, నేరడిగుండా, సిరికొండ మండలాల పోలీస్ స్టేషన్లను సందర్శించిన జిల్లా ఎస్పీ, మొదటగా సిబ్బంది ద్వారా గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న వాహనాల పై కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలాల పరిధిలో జాతీయ రహదారి ఉన్నందున ఎలాంటి రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తూ, రోడ్డు ఇంజనీరింగ్ తప్పిదం ఉన్న ప్రదేశాలలో సైన్ బోర్డులు, రంబుల్ స్ట్రిప్స్, జిగ్జాగ్ పద్ధతిని ఆవలంబిస్తూ ప్రమదాలను అరికట్టాలని తెలిపారు. మండలాల పరిధిలో ఎలాంటి మత్తు పదార్థాలను, గంజాయి పండించడం సేవించడం లాంటివి జరగకుండా పటిష్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ఇచ్చోడ మండల కేంద్రంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు తదితకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతూ అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు ముందస్తు మీటింగ్లు నిర్వహిస్తూ పర్యవేక్షిస్తుండాలని తెలిపారు. ముఖ్యంగా రహదారిలో దాబాలలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు మద్యం సేవించడం లాంటి వాటిని ఉపేక్షించకుండా నిరంతరం ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తూ అప్రమత్తమై విధుల నిర్వర్తించాలని సూచించారు.
ఆదివాసి ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పిస్తూ గంజాయి వల్ల ప్రభుత్వ పథకాలను నష్టపోతారు అనే విషయాన్ని తెలియజేస్తూ చైతన్య పరచాలని సూచించారు. ప్రస్తుత సమాజంలో ఉన్న సైబర్ క్రైమ్, చైల్డ్ మ్యారేజ్, యువతకు చదువుతూ ఉన్న లబ్ధిపై అవగాహన కల్పించే చైతన్యపరచాలని సూచించారు. స్టేషన్ల పరిధిలో రికార్డులను ఎప్పటికప్పుడు నవీకరిస్తూ ఎలాంటి పెండెన్సీ లేకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, ఇచ్చోడ సిఐ భీమేష్, ఎస్సైలు తిరుపతి, శ్రీకాంత్, శివరాం ప్రసాద్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments