మట్కా నేరస్థులపై పిడి యాక్ట్ సిఫార్సు
యువత ఆన్లైన్ గేమ్ లకు, మట్కా కు బానిస కాకుండా ఉండాలి...
* 9 మంది అరెస్ట్, మట్కా చట్నీలు, రూ 32,750/- నగదు స్వాధీనం జైనథ్ భీంపూర్ లలో 11 మందిపై కేసులు నమోదు*
* మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ.….
రిపబ్లిక్ హిందూస్థాన్ :
యువత, జిల్లా ప్రజలు మట్కా పై ఆకర్షితులు కాకుండా జిల్లా వ్యాప్తంగా మట్కా నిర్మూలనే లక్ష్యంగా పకడ్బందీగా చర్యలను తీసుకుంటున్నట్లు జిల్లా ఎస్పీ గౌష్ ఆలం ఈరోజు మధ్యాహ్నం స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ సమావేశ మందిరంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఈరోజు బీంపూర్ మరియు జైనథ్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసుల వివరాలను వెల్లడిస్తూ ఈ సంవత్సరం 12 కేసుల నందు 41 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి దాదాపు లక్ష రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలియజేశారు. అత్యాశకు పోయి డబ్బులను పోగొట్టుకోవద్దని యువతకు ప్రజలకు తెలియజేశారు.
ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మహారాష్ట్రకు ఆనుకొని ఉన్నందున బార్డర్ కి అవతల వైపు ఉన్న నేరస్తులు జిల్లాలో తరచూ మటక నిర్వహించే ప్రయత్నం చేస్తున్నారని వారిని విజయవంతంగా అడ్డుకోవడంలో జిల్లా పోలీసు వ్యవస్థ ముందుందని తెలియజేశారు. గత సంవత్సరం 43 కేసులను నమోదు చేసి 116 వ్యక్తుల అరెస్టు చేసి వారి వద్ద నుండి 6,54,660/- నగదును స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు. మట్కా నిర్వహిస్తున్న నిందితులను బైండోవర్ చేస్తూ అడ్డుకట్ట వేస్తున్నామని తెలియజేశారు. అదేవిధంగా తరచు మట్కా నిర్వహిస్తున్న నిందితులను పై పిడి యాక్ట్ సిఫార్సు చేయబోతున్నట్లు తెలియజేశారు. తల్లిదండ్రులు పిల్లల దిన చర్య పై ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి, పిల్లలు ఆన్లైన్ మట్కా, బానిస కాకుండా పర్యవేక్షిస్తూ ఉండాలని జిల్లా ఎస్పీ సూచించారు. అదేవిధంగా ఈరోజు జైనథ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు వివరాలు.
1) ఈ సత్యనారాయణ, తలమడుగు మండలం.
2) హెచ్ కిషన్, తలమడుగు.
3) సయ్యద్ రజి యుద్దీన్, అదిలాబాద్.
4) అశోక్ సామ్రాట్ (పరారీ).
ఈ నలుగురిపై జైనథ్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు అయినట్లు అదే విధంగా వీరి వద్దనుండి మట్కా చిట్టీలు, రూ 11,200/- నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలియజేశారు.
అదేవిధంగా బీంపూర్ పోలీస్ స్టేషన్ నందు నమోదైన కేసు వివరాలు.
1) కే శ్యామ్ రావు
2) మడవి దత్తు
3) రవీందర్
4) తొడసం బండు.
5) షేక్ సాజిద్.
6) ఆశిష్
7) సంజీవ్ జైస్వాల్ (పరారీ)
ఏడుగురిపై బీంపూర్ పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు చేసినట్లు వీరి వద్ద నుండి మట్కా చిట్టీలు రూ 21,700/- నగదు స్వాధీనం చేసుకోబడినట్లు తెలియజేశారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments