— రంజాన్ ఉపవాస దీక్షలు కొనసాగుతున్నా వేల ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ మీటింగ్*
— జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయంలో పీస్ కమిటీ మీటింగ్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
శనివారం స్థానిక జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం నందు ముస్లిం మత పెద్దలతో పవిత్ర రంజాన్ మాసం దీక్షలు మరియు రానున్న పండుగల సందర్భంలో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రానున్న పండుగలు నేపథ్యంలో కులమతాలకు అతీతంగా సామరస్యంగా వేడుకలు నిర్వహించాలని సూచించారు. పవిత్ర రంజాన్ మాసం ఉపవాస దీక్షలు కొనసాగుతున్న వేళ మరియు ప్రశాంత వాతావరణంలో దీక్షలను కొనసాగించాలని అని సూచించారు. జిల్లాలో పటిష్టమైన బందోబస్తు చర్యలు చేపట్టామని, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందుండి పరిష్కారం చూడాలని తెలిపారు.

జిల్లా ప్రజలందరూ ఎటువంటి అత్యవసర సమయంలోనైనా డైల్ – 100 లేదా సంబంధిత పోలీసు అధికారులకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ డి.ఎస్.పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, ఒకటవ పట్టణ సీఐ పి సురేందర్, ఎస్ఐ ఎండి కలీం,మత పెద్దలు, నాయకులు జహీర్ రంజానీ, బాబు షా, రషీద్, అబ్రార్ తదితరులు పాల్గొన్నారు.


Recent Comments