- రూ.3 లక్షల విలువ చేసే గుట్కా స్వాధీనం, డ్రైవర్ అరెస్టు గుట్కా వ్యాపారస్తుల
- ఆగడాలకు చెక్ పెడుతున్న సిసిఎస్ సిబ్బంది
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
నిషేధిత గుట్కా వ్యాపారం చేస్తున్న అక్రమార్కులపై పూర్తిస్థాయిలో పైచేయి సాధించి, పటిష్టమైన సమాచార వ్యవస్థ ద్వారా కట్టడి చేస్తున్నట్లు సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి సూచన మేరకు సిసిఎస్ పోలీసులు రాంపూర్ వద్ద మాటువేసి మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ పట్టణానికి వాహనంలో తరలిస్తున్న భారీ స్థాయిలో నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సిసిఎస్ సిఐ ఈ చంద్రమౌళి తెలిపిన వివరాల ప్రకారం విశ్వసనీయ సమాచారం మేరకు ఎస్ఐ హరిబాబు, సిసిఎస్ పోలీసులతో కలిసి రాంపూర్ వద్ద మాటువేసి ఉన్న సమయంలో మహారాష్ట్ర నుండి MH 26 EB 6552 నెంబర్ గల వాహనం లో నిషేధిత గుట్కా ఉందని ఆపి తనిఖీ చేయగా అందులో రూ 3 లక్షల విలువచేసే రాష్ట్రప్రభుత్వం నిషేధిత గుట్కా లభించిందని పేర్కొన్నారు. వాహనం డ్రైవర్ ఆనంద్ బుసనే(32) మహారాష్ట్ర నుండి ఆదిలాబాద్ పట్టణం సుందరయ్య నగర్ కు చెందిన అజాజ్ అహ్మద్ s/o ఫయాజ్ అహ్మద్ కు తరలిస్తున్నట్లు విచారణలో వాహన డ్రైవర్ వెల్లడించినట్లు సిఐ తెలిపారు. ఈ మేరకు డ్రైవర్ను అదుపులోకి తీసుకొని, స్వాధీనం చేసుకున్న వాహనం, రాష్ట్ర ప్రభుత్వం నిషేధిత గుట్కా ప్యాకెట్లను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. సమాచార వ్యవస్థను పటిష్టం చేసుకొని గుట్కాను పట్టుక్కునందుకు జిల్లా ఎస్పి డి ఉదయ్ కుమార్ రెడ్డి సిసిఎస్ పోలీసులను అభినందించారు. ఈ దాడుల్లో సిసిఎస్ ఎస్ఐ అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Recent Comments