Tuesday, March 11, 2025

సంచలనాత్మక హత్యకేసును 6 గంటల్లో చేదించిన ఆదిలాబాద్ జిల్లా పోలీసులు

గ్యాంగులు నిర్వహిస్తూ, తమతో పాటు అసాంఘిక కార్యకలాపాలకు ప్రేరేపించి ఒప్పుకొని ఎడల ఘోరంగా హత్యకు పాల్పడిన ముగ్గురు యువకులు.

• నిందితులను అదుపులోకి తీసుకొని, అరెస్టు చేసిన ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది.

• ముగ్గురు అరెస్ట్, కత్తి, మూడు సెల్ ఫోన్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం.*

• వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.

Adilabad Desk : ఆదిలాబాద్ పట్టణం కి సంబంధించిన ముగ్గురు యువకులు జల్సా లకు తిరుగుతూ అసాంఘిక కార్యకలాపాలకు, నేరాలకు పాల్పడడం జరుగుతుందని ఈ క్రమంలోని ఒక గ్యాంగ్ గా ఏర్పడి నేరాలను చేయాలనే ఒక దురుద్దేశంతో 
అదిలాబాద్ పట్టణంలోని క్రాంతి నగర్ నివాసం ఉండే
డ్రైవర్ గా పనిచేసే కొమ్మవార్ రవితేజ(26) తండ్రి లస్మా రెడ్డి , కొంతమంది యువకులు తమతో పాటు తిరుగుతూ నేరాలకు కలిసి పాల్పడదామని ఆలోచనతో అతనిని ప్రేరేపించడంతో దీనికి  అతను నిరాకరించడంతో గత రాత్రి హత్యకు గురైన విషయం ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి పాత్రికా సమావేశంలో వివరాలను వెల్లడించారు.

ఈ క్రమంలో బాధితుడు కొమ్మవారి రవితేజ భార్య కుమార్ ప్రవళిక ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ రెండో పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి నేరస్తులు
A-1: Govindu Karthik @ Golden Karthik s/o Ashok, Age: 24 yrs, caste: Rajputh, occ: Private employee, r/o Chilkurilaxminagar, Adilabad now at Mahalaxmiwada, Adilabad. Cell: 7993794141

A-2: Chelkala Pranith @ Siddu s/o Srinivas, Age: 26 yrs, caste: Munnurukapu, occ: Driver, r/o Indranagar, Adilabad. Cell: 9505840070

A-3: Davula Sai Kiran s/o Rajesh, Age: 20 yrs, caste: Madiga, occ: Lappam & POP Work, r/o Indranagar, Adilabad. Cell: 8897718609
ఆదిలాబాద్ పట్టణ నివాసస్తులను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు.
ఈ ముగ్గురు గత రాత్రి మద్యం సేవించి మద్యం మత్తులో పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళుతున్న కొమ్మవర్ రవితేజ ను దారి మధ్యలో అడ్డగించి తమతో గ్యాంగులో తిరగమని ప్రేరేపించడంతో అతను నిరాకరించి వీరి మధ్య జరిగిన గొడవలో ముగ్గురు అతనిని అతి దారుణంగా కొట్టడం జరిగింది తదుపరి A2 సిద్దు మరియు A3 సాయిలు రవితేజను పట్టుకోగా A1 గోల్డెన్ కార్తీక్ అనే వ్యక్తి అతనిని ఏడుసార్లు మెడ భాగంలో కత్తితో పొడిచి హత్య చేయడం జరిగిందని తెలిపారు. ఇదివరకే జిల్లాలో A1,A2 మరియు బాధితుడు రవితేజాలు పలు కేసుల్లో నిందితులుగా ఉన్న విషయాన్ని తెలియజేశారు. మొత్తంగా ఆరు గంటల వ్యవధిలోని ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీసులు కేసును చేదించి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి హత్యకు కారణమైన కత్తిని (బటన్ నైఫ్) , ముగ్గురి వద్ద నుండి 3 మొబైల్ ఫోన్లను, వినియోగించిన స్కూటీ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. జల్సాలకు పాటుపడుతూ భవిష్యత్తులో మరింత ఘోరమైన నేరాలను చేయాలని దురుద్దేశంతో ఒక గ్యాంగ్ గా ఏర్పడి నేరాలకు పాల్పడే వారి ఉద్దేశం సరైనది కాదని వారిపై ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 72/2025 తో సెక్షన్ 103 (1),r/w 3(5) బిఎన్ఎస్ తో కేసు నమోదు చేయబడిందని తెలియజేశారు. చేసి చేదించడంలో కీలకపాత్ర పోషించిన ఆదిలాబాద్ రెండవ పట్టణ సీఐ కరుణాకర్ రావు, ఎస్ఐ విష్ణు ప్రకాష్, సిబ్బంది, మరియు సిఐలు ఒకటో పట్టణ సీఐ సునీల్ కుమార్, సిసిఎస్ సీఐ చంద్రశేఖర్, జైనథ్ సిఐ సాయినాథ్, సిబ్బందిని ఆదిలాబాద్ డిఎస్పి అభినందించారు.

ఇదివరకే A1 పాల్పడిన నేరాలకు సంబంధించిన వివరాలు.
Criminal History of accused A-1 గోవిందుడు కార్తీక్:
1. Cr.No. 64/2023 U/Sec. 307 r/w 34 IPC of PS Adilabad Rural.
2. Cr.No.11/2024 U/Sec. 324, 506 r/w 34 IPC of PS Adilabad-II Town.
3. Cr. No.108/2024 U/Sec. 353, 324 IPC of PS Adilabad-II Town.
4. Cr.No. 230/2024, U/Sec. 294-B, 324 r/w 34 IPC of PS Adilabad-I Town.
5. Cr. No. 305/2024 U/Sec. 296(b), 115(2), 351(2) r/w 3(5) BNS of PS Adilabad-II Town.
6. Cr.No. 372/2024, U/Sec. 326 (f)(g), 296(b) r/w 3(5) BNS of PS Adilabad-II Town.

Criminal History of accused A-2 సిహెచ్ ప్రణీత్ @సిద్దు:
ఇదివరకే A2 పాల్పడిన నేరాలకు సంబంధించిన వివరాలు.

1. Cr.No. 01/2023, U/Sec. 324, 294-B, 506 r/w 109 IPC of PS Adilabad-II Town.
2. Cr.No.219/2023, U/Sec. 427, 506, 290 IPC of PS Adilabad-II Town.
3. Cr.No. 230/2023, U/Sec. 143, 153 (a), 427, 294-B, 506 r/w 34 IPC of PS Adilabad-II Town.
4. Cr.No. 455/2024, U/Sec. 118(1), 296(b), 351(2), 324(4) BNS of PS Adilabad-II Town.
5. Cr.No. 29/2025 U/Sec. 296(b), 351(2) r/w 3(5) BNS of PS Adilabad-II Town.

నేరస్తులపై రౌడీ షీట్లను ఏర్పాటు చేయాలన్నట్లు ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి