రిపబ్లిక్ హిందుస్థాన్ | ఆదిలాబాద్ | నవంబర్ 3 :
ఆదిలాబాద్ జిల్లా బోథ్ సర్కిల్ నూతన సీఐగా డి. గురుస్వామి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఐపీఎస్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ బోథ్ సర్కిల్ పరిధిలో ఉన్న రెండు పోలీస్ స్టేషన్లలో గంజాయి, గుడుంబా వంటి అసాంఘిక కార్యకలాపాలను పూర్తిగా రూపుమాపే దిశగా కృషి చేయాలని, పోలీసు విధుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సిబ్బంది పనితీరుపై పర్యవేక్షణను కఠినంగా అమలు చేయాలని సూచించారు.
గతంలో ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలలో సేవలు అందించిన డి. గురుస్వామి, నూతనంగా బోథ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా బదిలీ అయ్యారు. అంతకు ముందు స్పెషల్ బ్రాంచ్, వరంగల్ నందు విధులు నిర్వర్తించి, ఆదిలాబాద్ జిల్లాలో బోథ్ సీఐగా నియమితులయ్యారు.
బాధ్యతలు స్వీకరించిన డి. గురుస్వామి గారు, జిల్లా ఎస్పీ మార్గదర్శకత్వంలో నేర నియంత్రణ, ప్రజా రక్షణ, శాంతి భద్రత పరిరక్షణలో నిబద్ధతతో పని చేస్తానని తెలిపారు.
బోథ్ నూతన సీఐగా డి. గురుస్వామి బాధ్యతల స్వీకరణ
Thank you for reading this post, don't forget to subscribe!


Recent Comments