ఆదిలాబాద్ : ఎన్నికల్లో మాత్రమే నాయకులు ధర్మం రక్షణ , అభివృద్ధి అంటూ ప్రగల్భాలు పలుకుతూ సెంటిమెంట్ తో రెచ్చగొట్టి గెలుస్తూ వస్తున్నారు. కానీ ఆ తరువాత వచ్చే ఐదేళ్లు ప్రజలు ఏవిధమైన కష్టాలు ఎదుర్కొంటా రో ఈ చిత్రంలో చూడవచ్చు. రామ్ మందిర్ మరియు గోశాల కు వెళ్ళే దారి పరిస్థితి చూడండి….
ఇచ్చోడ మండలం బోరిగామ గ్రామపంచాయతీ పరిధిలోని శ్రీరామ లక్ష్మణ జైశ్రీరామ్ గోశాలకు వెళ్లే మట్టి రోడ్డు ఈ భారీ వర్షాలకు బురదమయంగా మారింది. దీంతో గోశాలకు ఎలాంటి వాహనాలు వెళ్లడం లేదు. కాగా అక్కడే నివాసం ఉంటున్న గోశాల నిర్వాహకులు రాజేష్ తన కూతురిని నిత్యం పాఠశాలకు ఇలా ఎడ్ల బండి తీసుకెళ్లి స్కూలుకు పంపిస్తున్నాడు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఈ రోడ్డును బాగు చేయాలని ఆయన వేడుకుంటున్నాడు.
జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ముఖ్యమైన సమస్య రోడ్డు సమస్య . ఇకనైనా ప్రజాప్రతినిధులు స్పందించి రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని ప్రజలు కోరుతున్నారు.
Recent Comments