మున్సిపల్ కమిషనర్ ను కలిసి వినతిపత్రం సమర్పించిన యూత్ కాంగ్రెస్ సభ్యులు….
రిపబ్లిక్ హిందూస్థాన్, ఆదిలాబాద్ : నీటి సమస్య తీర్చాలని మున్సిపల్ కమిషనర్ శైలజ ను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సామ రూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ సామా రుపేష్ రెడ్డి మాట్లాడుతూ…
అదిలాబాద్ పట్టణంలోని వార్డ్ నంబర్ 2 మహాలక్ష్మివాడ పరిధిలో గల చిలుకూరి లక్ష్మినగర్ కాలనీ లో నీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. కాలనీ లో మిషన్ భగీరథ నల్ల కనెక్షన్లు లేకపోవడంతో కరెంటు ఉన్నప్పుడు మాత్రమే నల్ల వస్తుందన్నారు. కొన్ని నెలల నుండి ఒకరోజు తప్పించి మరొక రోజు నల్ల నీళ్లు వస్తున్నాయన్నారు. దీనివల్ల మంచినీటి సౌకర్యం లేక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందన్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు కాలానికి వచ్చినా మా సమస్యను పరిష్కరించడం లేదన్నారు.
కాలనీలో ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి ఇబ్బందులను దూరం చేసి మిషన్ భగీరథ కనెక్షన్ నీళ్లు వచ్చేటట్లు చూడాలని కమిషనర్ గారిని కోరడం జరిగిందన్నారు. అయితే సానుకూలంగా స్పందించిన కమిషనర్ కాలనీ వాసుల నీటి కష్టాలు దూరం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఇమ్రాన్,వినోద్, తోఫి,రేఖబాయి,యస్మిన్, తదితరులు ఉన్నారు.


Recent Comments