ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలోని బంగారు గుడ మురికివాడలో పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని హార్టెక్ స్వచ్ఛంద సంస్థ మరియు ఆరోగ్య జ్యోతి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో చిన్నారులకు షూ మరియు బట్టలు వృద్ధులకు బ్లాంకెట్లను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు కే నరేష్ కుమార్ మాట్లాడుతూ నూతన సంవత్సరం నీ దృష్టిలో పెట్టుకొని మురికివాడ అయినటువంటి బంగారు గుడ లో చిన్నారులకు షూ మరియు బట్టలు వృద్ధులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. దాదాపు 100 మంది పిల్లలకు పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా నూతన సంవత్సరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నారులకు బిస్కెట్లు చాక్లెట్లు కూడా పంపిణీ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అజీజ్, శ్రీకాంత్, ఆసిఫ్ తో పాటు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Recent Comments