రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ /ఇచ్చోడ:
జిల్లా కలెక్టర్ ఆదేశానుసారంగా ఏజెన్సీ చట్ట పరిరక్షణలో భాగంగా ఇచ్చోడ గ్రామంలో అక్రమ లేఅవుట్లు, నిర్మాణా బహుళ అంతస్తులు, రైతు బందు దుర్వినియోగం పై సంబంధిత అధికారులు సర్వేను పకడ్బందీగా నిర్వహించి సర్వే చేపట్టాలనీ ఆదివాసి యువ శక్తి సేన రాష్ట్ర కో కన్వీనర్ మెస్రం ఆనంద్ రావ్ అధికారులను కోరారు.
అక్రమాల వాస్తవాలను కప్పిపుచ్చకుండా కచ్చితత్వాన్ని క్లుప్తమైన నివేదిక పై అధికారులకు సమర్పించాలని , సర్వే వాస్తవాలు దుర్వినియోగం కాకుడదనీ అన్నారు. ఉదాహరణకు ఆసిఫబడ్లో గతంలో అక్రమాల వాస్తవ పరిస్థితులు ఉండి కూడ లెనట్లుగా రిపోర్టు ఇవ్వడంలో గత జిల్లా కలెక్టర్, ఆర్డీవో లపై హైకోర్టు వెటు వెసిన విషయం తెలిసిందే అని అన్నారు.
ఇచ్చోడ గ్రామ శివారంలొ ఇనాం భూములు, సీలింగ్, వారసులు లేని భుములలొ అక్రమ లేఅవుట్ నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుత సర్వే నివేదిక సంత్రుప్తిగా ఉండాలనీ అన్నారు.
సరైన నివేదిక లేని యెడల ED ద్వారా మరొ సర్వే చేయడానికి ఫిర్యాదు చేయడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారనీ అన్నారు.
ప్రస్తుతం ఇచ్చోడ గ్రామంలో సర్వే జరుగుతుంది. మీడియా స్పందించి బహిర్గతం చెయ్యాలనీ అన్నారు. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారదిగా ఉండే మీడియా ఇచ్చోడ గ్రామంలో సర్వే జరుగుతున్న తిరుపై ప్రజలకు తెలపాలని ప్రజలు కోరారు.
ప్రజా ప్రయోజనాలు, ప్రజా అవసరాలకు ఆటంకం ఎర్పరిచె వారి నుంచి ప్రజా ఆస్తులను స్వాదినం చెయ్యాలనీ అన్నారు. ఇచ్చోడ గ్రామంలో ప్రజా దనానికి నష్టం కల్గించిన సంబంధిత అదికారులపై కఠిన చర్యలు తిసుకొవాలనీ , ధరణి 2020 నిబంధనలో పొందుపరచిన విదంగా తప్పుచెసిన అదికారిని ఉద్యోగం నుంచి తొలగించాలని ఉన్న నిబంధనల ప్రకారం చర్యలు తిసుకొవాలనీ డిమాండ్ చేశారు.
Recent Comments