రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : ప్రభుత్వ జూనియర్ కళాశాల గుడిహత్నూర్ యందు పదవీ విరమణ, బదిలి పై వేళ్ళిన సిబ్బందికి ఆత్మీయ సన్మానం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డి.శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన
జిల్లా మాధ్యమిక విద్యాధికారి సి.రవీందర్ కుమార్ మాట్లాడుతు ఉద్యోగి అనప్పుడు నియామకం, బదిలి,పదవి విరమణ సహజమని అన్నారు. అంకిత భావంతో పని చేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందన్నారు.
అనంతరం ఉద్యోగ విరమణ పొందిన దారవేణి కిష్టు లను సన్మానించిన అనంతరం బదిలి పై వేళ్ళిన ,వచ్చిన అధ్యాపకులు లెనిన్ , సూరజ్ సింగ్ , డి.శ్రీనివాస్, రాథోడ్ శ్రావణ్, బోధనేతర సిబ్బంది
అశోక్ , ముజాహిద్, అరవింద్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది , విద్యార్థినివిద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments