• వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఇతరులను నిందించడం సరికాదు.
• నిజా నిజాలు తెలుసుకోకుండా సోషల్ మీడియాలో పోస్టులు చేసిన, ఫార్వర్డ్ చేసిన వారిపై గ్రూప్ అడ్మిన్ లపై చర్యలు తప్పవు
•• ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఆరు నెలల క్రితం ఆదివాసి మహిళ సాధారణ మరణం పై ప్రస్తుతం కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం మార్చి నెలలో జరిగిన సంఘటనలపై ప్రస్తుతం వీడియోలను ఫోటోలను తీస్తూ, దుష్ప్రచారం చేస్తూ ఉన్న వీడియోలను ఇతరులకు పంపిన ఫార్వర్డ్ చేసిన, గ్రూపు అడ్మిన్ లపై, ఫార్వర్డ్ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. వివరాలలో ఒక ఆదివాసీ మహిళ తేదీ 2-3-24 రోజున బోథ్ సిహెచ్సి నందు అడ్మిట్ అయి తేదీ 03-03-24 రోజున బోథ్ సిహెచ్సి కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేసుకొని అదే నెల ఐదవ తారీఖున డిశ్చార్జ్ అయినది, తేదీ 14 3 2024 ఇంటి వద్ద మరణించినది. మహిళ మరణం పట్ల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు 174 సి ఆర్ పి సి కింద కేసు నమోదు చేసి బి రాము ఎస్సై బోథ్ మహిళ గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టి సాక్షులను వాంగ్మూలమును నమోదు చేసి సివిల్ అసిస్టెంట్ సర్జన్ ద్వారా పోస్టుమార్టం నిర్వహించడం జరిగింది. దర్యాప్తు మరియు పీఎంఈ రిపోర్టు ఆధారంగా ఈ కేసు 31-03-24 రోజున అనారోగ్య మరణం కారణంగా కేసును పరిష్కరించడం జరిగింది.
ఈ నిజా నిజాలు తెలుసుకోకుండా మార్చి నెలలో జరిగిన విషయాన్ని ఇప్పుడు కావాలని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూ తప్పుడు వార్తలు సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి వ్యక్తిగత ప్రయోజనాలను పొందుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని ఆదిలాబాద్ డిఎస్పీ యల్ జీవన్ రెడ్డి తెలిపారు. నిజానిజాలు తెలుసుకోకుండా, అసత్య ఆరోపణలను సోషల్ మీడియా నందు దుష్ప్రచారం చేసిన, వైద్యులను కించపరుస్తూ, వాట్సాప్ నందు గ్రూప్ అడ్మిన్ లపై కేసులను నమోదు చేయబడతాయని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. సోషల్ మీడియాలో వచ్చే ప్రతి ఒక్క విషయం నిజమని నమ్మకూడదని సూచించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments