Friday, November 22, 2024

ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్న మహిళకు అరుదైన శస్త్రచికిత్స

ఊపిరితిత్తులలో చేరిన నీళ్లను ఫ్యూరో స్కోప్ పద్దతిలో బయటకు తీసిన డాక్టర్లు

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఇచ్చోడ : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన ముండే లక్ష్మీ గత కొన్ని రోజులు గా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతుంది . అయితే చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రికి వెళ్లగా , ఊపిరితిత్తుల లో నీళ్లు చేరి నట్లు గుర్తించారు. చికిత్స చేసి బయటకు తిస్తేనే నయం అవుతుందని అక్కడి డాక్టర్లు తెలిపారు. అయితే అధిక ఖర్చు తో కూడుకున్న ట్రీట్మెంట్ కావడంతో , ఇచ్చోడల్లో ని ఓ రిటైర్డ్ వైద్యాధికారి ని బాధిత మహిళ కుటుంబ సభ్యులు సంప్రదించారు. అయితే ఇచ్చోడకు చెందిన డాక్టర్ ఆశిష్ కేంద్రే , డాక్టర్ అభిషిల్ , డాక్టర్ సూరజ్ లు కలిసి మహిళకు ఫ్యూరో స్కోపీ ప్లిన్ రేడిసిస పద్దతిలో నీళ్లు తీసి అరుదైన ఘనత సాధించారు. రెండు రోజుల క్రితం చేసిన ఈ అరుదైన శస్త్రచికిత్స విజయవంతమైనట్లు డాక్టర్ పేర్కొన్నారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి