మొదటి విడత మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళాకు యువతకు ఆహ్వానించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
Thank you for reading this post, don't forget to subscribe!
రిపబ్లిక్ హిందూస్తాన్, బజార్ హత్నూర్ : 5 మండలాల యువత, ప్రజలు ఈ నెల 18తేదీ వరకు తమ
తమ వివరాలను పోలీస్ స్టేషన్ నందు నమోదు చేసుకోవాలి.అని
ఈ క్రింద తెలిపిన నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, బీంపూర్ మండలాల యువతకు మొదటి విడతలో సదవకాశం. కల్పిస్తున్నట్లు ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్
తెలిజేస్తూ యువత ఆధార్ కార్డు, టెన్త్ క్లాస్ మెమో లేదా అడ్రస్ ప్రూఫ్ జిరాక్స్లను పోలీస్ స్టేషన్ నందు అందజేయాలి అని.
ఆన్లైన్ నందు లేదా మీసేవ సెంటర్లలో రుసుములు చెల్లించాలి.
అంటూ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.బుధవారం ఒక ప్రకటన ద్వారా తెలిజేశారు..
ఆదిలాబాద్ జిల్లాలో నిరుపేద యువతీ, యువకులు, ప్రజలు రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహన నియమ నిబంధనలు పాటించడానికి ప్రత్యేకంగా జిల్లా పోలీసు యంత్రాంగం తరపున మొదటి విడత 5 మండలాలలో మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న్నామని, ఈ సందర్భంగా 5 మండలాలు నార్నూర్, గాదిగూడ, బజార్హత్నూర్, సిరికొండ, బీంపూర్ లలో యువత, ప్రజలు తమ యొక్క ఆధార్ కార్డు మరియు అడ్రస్ ప్రూఫ్ లేదా టెన్త్ క్లాస్ మెమో జిరాక్సులను సంబంధిత పోలీసు స్టేషన్ల నందు అందించి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వీరూ మొదటగా ఆన్లైన్ నందు లేదా. మీసేవ కేంద్రాల్లో *లర్నింగ్ లైసెన్స్* కై 600 రూపాయల రుసుము చెల్లించవలసిందిగా ఉంటుందని, తదుపరి లర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత నెల రోజుల నుండి ఆరు నెలల లోపు పర్మినెంట్ లైసెన్స్ కొరకు 1200 రూపాయల రుసుమును ప్రభుత్వానికి చెల్లించవలసి ఉంటుందని తెలియజేశారు. ఈ మెగా డ్రైవింగ్ లైసెన్స్ మేళా ను ప్రజలు, యువత పెద్ద ఎత్తున సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలిపారు. ఈనెల 18వ తారీకు వరకు రిజిస్ట్రేషన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. యువత ప్రజలు వాహన నియమనిబంధనలు పాటించాలని ప్రమాదాలకు గురి కాకుండా లైసెన్సులు నియమాలు ఉపయోగపడతాయని సూచించారు.
Recent Comments