ePaper
Wednesday, March 4, 2026
📄 ePaper

జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలు : జిల్లా ఎస్పీ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!

🔶 ముందస్తు అనుమతి లేకుండా ప్రజా బహిరంగ కార్యక్రమాలు నిషేధం…

🔶 ఈనెల 31 వరకు జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు వర్తిస్తాయి, ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి



రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శాంతిభద్రతల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణ పరిస్థితులను మరింత సవ్యంగా కొనసాగించడానికి ఈరొజు నుండి జులై 31 వరకు జిల్లా అంతటా 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం పోలీసు ముఖ్య కార్యాలయం నుండి ఒక ప్రకటన విడుదల చేస్తూ వివరాలు వెల్లడించారు. 30 పోలీస్ యాక్ట్-1861 అమల్లో ఉన్నందున జిల్లాలో డిఎస్పి లేదా పోలీస్ ఉన్నతాధికారుల నుండి ముందస్తు అనుమతి లేకుండా ఏలాంటి ప్రజా సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, తదితర ప్రజలు గుమికూడి ఉండేవిధంగా కార్యక్రమాలు నిర్వహించడానికి సన్నాహాలు చేయరాదని తెలిపారు. నిషేధిత ఆయుధాలు, కత్తులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డు కర్ర లు, తుపాకులు, పేలుడు పదార్థాలు, దురుద్దేశంతో నేరాలకు ఉసి కోలిపే ఎటువంటి ఆయుధాలు కల్గిఉండరాదని తెలిపారు. ప్రజా జనజీవనానికి ఇబ్బంది, చిరాకు కల్గించేందుకు దారితీసే ఇబ్బందికర ప్రజా సమావేశాలు, జన సమూహం అలాంటివి పూర్తిగా నిషేధం అన్నారు. రాళ్లను ఒకేచోట జమ చేయుట,ధరించి సంచరించుట, లౌడ్ స్పీకర్లు, డీజే లు వంటివి నిషేధమని తెలిపారు. ప్రచార రథాలు, మైకులు, తదితర అధిక శబ్ద పరికరాలు నిషేధించబడినవని సూచించారు. చట్టపరమైన జారీచేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘిస్తే 30 పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం శిక్షార్హులు అవుతారని సూచించారు. నిషేధంలో ఉన్న నిబంధనలను తప్పనిసరిగా అందరూ పాటించాలన్నారు, ఏలాంటి కార్యక్రమాలు నిర్వహించాలన్న ముందస్తుగా దరఖాస్తు చేసుకొని అనుమతులు తీసుకోవాలని సూచించారు. 30 పోలీస్ యాక్ట్ నిబంధనలు విధినిర్వహణలో ఉన్న పోలీసులు, కేంద్ర రక్షణ దళాలు, విధి నిర్వహణలోని హోంగార్డులు, ప్రభుత్వ సెక్యూరిటీ గార్డులు, అంత్యక్రియల ఊరేగింపునకు వర్తించదని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!