– జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
ఈ విజయం జిల్లా పోలీసులందరికీ దక్కుతుందని అభివర్ణించిన జిల్లా ఎస్పీ
ప్రజల భద్రత, సురక్షితమైన జిల్లాలలో ఆదిలాబాద్ జిల్లాకు దేశంలోనే ఐదవ స్థానం రావడం సంతోషకరం..
జిల్లా ఎస్పీకి అభినందనలు తెలియజేసిన జిల్లా పోలీసు అధికారులు,పలు ప్రజా సంఘాల ప్రతినిధులు
ప్రత్యేక అభినందనలు తెలియజేసిన హిందూ ఉత్సవ సమితి సభ్యులు
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శాంతి భద్రతల పరిరక్షణలో అనుక్షణం అహర్నిశలు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాలను అనుసరిస్తున్న జిల్లా పోలీసు అధికారులందరి సమన్వయ కృషితోనే ఆదిలాబాద్ జిల్లా దేశంలోనే అత్యంత సురక్షితమైన జిల్లాగా ఐదవ స్థానాన్ని సంపాదించింనది.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ ఘనత కష్టపడి అహర్నిశలు జిల్లా ప్రజలకై పనిచేసిన ప్రతి ఒక్క పోలీసు అధికారికి సిబ్బందికి దక్కుతుందని తెలియజేశారు. ఈ విజయం జిల్లా పోలీసుల ప్రతి ఒక్కరిది అని, సమిష్టి కృషితోనే ఇలాంటి విజయాలు సాధ్యమవుతాయని తెలిపారు. జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు అధికారి నుండి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు.
అలాగే జిల్లా లో పనిచేస్తున్న పోలీసు అధికారులు జిల్లా ఎస్పీ ని కలిసి శాలువా తో సత్కరించి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. దేశంలోనే 85 మార్కులతో అదిలాబాద్ జిల్లా అత్యంత సురక్షితమైన జిల్లాలలో ఐదవ స్థానాన్ని సంపాదించిందని,గత సంవత్సరం జరిగిన నేరాలు జాతీయ నేర నమోదు గణాంక సంస్థ(నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) ద్వారా సామాజిక ప్రగతి సూచిక పై, సురక్షితమైన జిల్లాల నివేదిక ను తయారుచేసి ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ద్వారా నివేదికను విడుదల చేస్తారు, అందులో దేశంలో మొదటి స్థానం నాగాలాండ్ లోని మొకోక్ జిల్లా 89.89 మార్కులతో ఉందని, అదిలాబాద్ జిల్లా 85 మార్కులతో 5వ స్థానంలో (తెలంగాణలో మొదటి స్థానం), తెలంగాణలో 81 మార్కులతో కరీంనగర్ జిల్లా రెండవ స్థానాన్ని దక్కించుకుందని తెలియజేశారు.
ఈ నివేదికలో ముఖ్యంగా పరిగణలోకి తీసుకునే అంశాలు జిల్లాలో జరిగిన నేరాలు, నేరాల దర్యాప్తు, పరిశోధన, నేరస్తులకు శిక్షలు, ఆర్థిక నేరాల అడ్డుకట్ట, మహిళల పై చిన్నపిల్లలపై జరిగే నేరాలు, సైబర్ క్రైమ్, తదితర అంశాలు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఆదిలాబాద్ జిల్లాను సురక్షిత జిల్లాగా కేంద్రం ప్రకటించినందుకు ప్రత్యేకంగా శాలువా తో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి మిఠాయిలు అందించి అభినందనలు తెలియజేశారు. హిందూ ఉత్సవ సమితి అధ్యక్షుడు బొంపెల్లి హనుమాన్లు, సభ్యులు ఉప్లెంచి కృష్ణ, గందె ఉదయ్ కుమార్, ఈ భాస్కర్ గౌడ్, కోరెడ్డి లెనిన్ ఉన్నారు.
అభినందనలు తెలియజేసిన పోలీస్ అధికారుల లో అదనపు ఎస్పీలు ఎస్ శ్రీనివాసరావు, సి సమైజాన్ రావు, డిసిఆర్బి డిఎస్పి పోతారం శ్రీనివాస్, పరిపాలన అధికారి యూనుస్ అలీ, సీసీ దుర్గం శ్రీనివాస్, సిఐలు కే పురుషోత్తం, జె కృష్ణమూర్తి, జె గుణవంతురావ్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, బి శ్రీ పాల్, ఎం వంశీకృష్ణ, స్పెషల్ బ్రాంచ్ ఎస్సై అన్వర్ ఉల్ హక్, తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments