తల్వార్ లతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే లా వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు వ్యక్తిపై సుమోటో కేసు నమోదు.…
*ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో ఆమ్స్ ఆక్ట్ లో కేసు నమోదు.….
*ఆదిలాబాద్ ఒకటవ పట్టణ సీఐ బి సునీల్ కుమార్….
రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ : ఆదిలాబాద్ ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగారిగూడ కు సంబంధించిన సలీం ఖాన్ అనే వ్యక్తి సోషల్ మీడియా అయిన ఇంస్టాగ్రామ్ లో తల్వార్లతో ఒక పోస్టును పెట్టడం జరిగింది, దానిని సుమోటో కేసు గా నమోదు చేసిన ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ సునీల్ ఈరోజు సలీం ఖాన్, బంగారిగూడ కు సంబంధించిన వ్యక్తిపై ఆమ్స్ ఆక్ట్ తో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఇదివరకే సలీం ఖాన్ అనే వ్యక్తి పలు ముఖ్యమైన కేసులలో నిందితుడుగా ఉన్న విషయాన్ని తెలిపారు.
ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి వీడియో లు అయినా సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతారని హెచ్చరించారు. అదేవిధంగా కత్తులతో కానీ తల్వార్లతో గాని బొమ్మ తుపాకులతో కానీ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేలా ఎలాంటి వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వారిపై చట్ట ప్రకారం ఆమ్స్ ఆక్టిలో కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.


Recent Comments