• తప్పు చేసిన వారికి కఠిన శిక్షలు తప్పవు
• మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో ముగ్గురు నిందితులు పై కేసు నమోదు, అరెస్టు.
• సోషల్ మీడియా నందు వదంతులను, పుకార్లను వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు.
• సకాలంలో స్పందించిన జిల్లా ఇన్చార్జి ఎస్పి మరియు జిల్లా పోలీసు యంత్రాంగం.
• శాంతి భద్రతల విఘాతం కల్పించే వారిపై ప్రత్యేక నిఘా.
• జిల్లా ఇన్చార్జి ఎస్పి శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్...
ఆదిలాబాద్ : జిల్లాలో మైనర్ బాలికపై అత్యాచార ఘటనలో జిల్లా ఇన్చార్జి ఎస్పి గారి నేతృత్వంలో తగిన సూచనలతో జిల్లా పోలీసు యంత్రాంగం సత్వరమే స్పందించి శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కల్పించకుండా నిందితులను సకాలంలో అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరు పరిచి జిల్లా జైలుకు పంపడం జరిగింది. ఘటన వివరాలు తెలుసుకున్న జిల్లా ఇన్చార్జి ఎస్పి ఉటాటిన నిన్న రాత్రి RIMS ఆసుపత్రికి చేరుకుని సంబధిత అధికారులకు సూచనలు చేయటం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ శ్రీమతి జానకి షర్మిల ఐపీఎస్ గత రాత్రి ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న బాధితురాలని సంఘటన స్థలాన్ని స్వయంగా పరిశీలించి అధికారులకు సూచనలు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి ఎస్పీ మాట్లాడుతూ ప్రజలందరూ సంయమనం పాటించాలని సోషల్ మీడియా నందు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించే వదంతులను పుకార్లను నమ్మవద్దని అదేవిధంగా వాటిని సృష్టించి వ్యాప్తి చేసేవారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకొని కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని తెలియజేస్తూ తప్పుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు.
అదేవిధంగా నిందితులైన
A1) ఇంగోలే అనిల్,
A2) ఇంగోలే గంగాధర్,
A3) దుప్పాత్రే సుష్మ, లను సెక్షన్ 127(2),70(2),109(i) 351 (3) r/w 49 BNS 2023, sec 5(g) r/w 6 of పోక్సో యాక్ట్ 2012 తో క్రైమ్ నెంబర్ 42/2025 తో కేసు నమోదు చేయడం జరిగింది తెలిపారు. ఎలాంటి సందేహం లేకుండా, నిష్పక్షపాతంగా దర్యాప్తు కొనసాగుతుందని తెలియజేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున ఈ సందర్భంలో ఎవరు గుమికూడి ఉండకుండా, సభలు, సమావేశాలు నిర్వహించకుండా ఉండాలని, ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోబడతాయని తెలిపారు. నియమ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయని తెలియజేశారు. పట్టణంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా గస్తీ, పెట్రోలింగ్, పికెట్స్ ఏర్పాటు చేసి పర్యవేక్షించడం జరిగిందని తెలిపారు. గత రాత్రి జిల్లా ఇన్చార్జి ఎస్పీతో పాటుగా ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి పోతారం శ్రీనివాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments