రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్: ACL(ఆదిలాబాద్ క్రికెట్ లీగ్) టోర్నమెంట్ ఫైనల్ విజేత లకు బహుమతి ప్రధానోత్సవ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా జోగురామన్న MLA గారు హాజరు అయ్యారు.గత 40రోజులు గా మల్టీ మైదానంలో జరుతున్న మ్యాచ్ లకు ఈరోజు ముగింపు పలికింది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో జాహ్నవి జట్టు మరియు ఫిల్డర్ బెట్ జట్లు హారహోరిగా తలపడ్డాయి. మొదట జాహ్నవి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది నిర్ణిత ఓవర్లలో 168 పరుగులు చేసి ఫిల్డర్ బెట్ ముందు లక్ష్యాన్ని ఉంచింది.ఫిల్డర్ బెట్ జట్టు చివరి వరకు పోరాడి ఓడిపోయింది. మ్యాన్ అఫ్ ది సిరీస్ గా అనుష్, బెస్ట్ బ్యాట్స్ మెన్ అఫ్ ది టోర్నమెంట్ గా జైగణేష్ ఎంపిక అయ్యారు.విజేత (జాహ్నవి) జట్టుకు మరియు రన్నర్ అప్ (ఫిల్డర్ బెట్) జట్టు కు జోగురామన్న గారు ట్రోఫి ని అందజేశారు.బహుమతి ప్రధానోత్సవం అనంతరం అయన మాట్లాడుతూ జోగు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండల్లాల్లో ఇలాంటి టోర్నమెంట్లు నిర్వహిస్తున్నామని ఆటగాళ్ళ ప్రతిభను వెలికి తీసి వారిని జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి వెళ్ళడానికి జోగు ఫౌండేషన్ ప్రోత్సహిస్తుందని జట్టు కు అవసరమైన క్రికెట్ కిట్లను అందిస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో MLA జోగురామన్న తో పాటు క్రికెట్ క్లబ్ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.
Thank you for reading this post, don't forget to subscribe!ముగిసిన ఆదిలాబాద్ క్రికెట్ లీగ్ టోర్నమెంట్
- Advertisment -
Recent Comments