— మత విద్వేషాలు రెచ్చగొట్టిన వ్యక్తి అరెస్టు, 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్
Thank you for reading this post, don't forget to subscribe!— మత విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు, స్టేటస్లు చేసేవారికి కఠిన చర్యలు తప్పవు.*
— ప్రజలు పుకార్లను నమ్మవద్దు ఎటువంటి సందేహాలు కైనా సంబంధిత పోలీసు అధికారులకు సంప్రదించాలి
జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
శనివారం ఆదిలాబాద్ పట్టణంలోని మత విద్వేషాలకు రెచ్చగొట్టేలా వాట్సాప్ లో స్టేటస్ పెట్టిన దొంగ్రె పింటూ అనే వ్యక్తిని ఈరోజు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో అరెస్టు చేసి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్కు పంపడం జరిగిందని జిల్లా ఎస్పి ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రజలందరికీ ఎవరైనా ఇలాంటి మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్ట్లు పెట్టినట్లైతే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు, ఇలాంటి పోస్టులను ప్రజలు నమ్మకూడదని, సంయమనం పాటించాలని పోలీసు వ్యవస్థ దోషులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తుందని తెలిపారు. ఇలాంటి మత విద్వేషాలను ఎవరైనా సరే రెచ్చగొట్టే ప్రయత్నం చేసినచో వెంటనే చట్టం, పోలీసులు వ్యవస్థ తగు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు మత విద్వేషాలను రెచ్చగొట్టేలా చేసే పుకార్లను విశ్వసించ కూడదని ఎలాంటి సందేహాలకు అయినా జిల్లాలోని పోలీసు అధికారులను సంప్రదించవచ్చని తెలిపారు.
Recent Comments