Tuesday, October 14, 2025

ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్

ఏజెన్సీ ప్రాంతాల్లో పకడ్బందీగా 1/70 అమలు

Thank you for reading this post, don't forget to subscribe!

వడ్డీ వ్యాపారుల నుంచి సంరక్షణ గిరిజన ఆదివాసీలకు రక్షణ..

1/1959 రెగ్యులేషన్ ప్రకారం 01.12.1963 నుండి గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు చెల్లదు…

1/70 నియమాల ప్రకారం 03.02.1970 నుండి గిరిజనుల లేదా గిరిజనేతరుల భూ బదలాయింపు గిరిజనేటరులకు చెల్లదు….

గిరిజనుల, గిరిజనేతరులకు మధ్య నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి ఏజెన్సీ కోర్టులను ఆశ్రయించాలని ఆన్నారు.

ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘించినచో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, లేదా 2 వేల రూపాయలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు

రిపబ్లిక్ హిందుస్థాన్ , ఆదిలాబాద్ : ఎట్టకేలకు ప్రభుత్వం ఆదివాసుల హక్కుల పై కీలక అంశాలపై అధికారులకు ఆదేశాలు జారీచేసినట్లు తెలుస్తుంది.

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరు రాజర్షి షా అధికారులతో నిర్వహించన సమావేశంలో పలు విషయాలు వెల్లడించారు.
గిరిజనుల సామాజిక పద్ధతులు, ఆచార వ్యవహారాలు, జీవన విధానం మిగితా మైదాన ప్రాంతవాసులకు భిన్నంగా ఉండటడం, గిరిజనుల అమాయకత్వాన్ని, నిరక్షరాస్యతను ఆసరా చేసుకొని తీవ్రదోపిడికి గురికాకుండా 1 of 70 చట్టాల రక్షణ కల్పిస్తున్నాయి.
భారత రాజ్యాంగం లోని 5 వ షెడ్యుల్ అధికరణలు 15,16, 46, 244, 275, 330, 322, 334, 335, 338, 339, 342, గిరిజనులకు రక్షణ కల్పిస్తున్నాయి.

రాజ్యాంగం కల్పించిన రక్షణలు
ఎన్నికలలో రిజర్వేషన్, ఏజెన్సీలో ST లకే పదవులు, విద్యా వసతులు, ఉద్యోగాలలో ఏజ్ సడలింపు,
వడ్డీ వ్యాపారుల నుంచి సంరక్షణ 1 of 70 నిబంధనల ఉద్దేశం. ఆదివాసుల భూమి రక్షణ కోసం, మైదాన ప్రాంతవాసులు ఏజెన్సీ లోకి వలస రాకుండా అడ్డుకోవడం.

1/1959 రెగ్యులేషన్ ప్రకారం 01.12.1963 నుండి గిరిజనుల నుండి గిరిజనేతరులకు భూమి బదలాయింపు చెల్లదు.
1/70 నియమాల ప్రకారం 03.02.1970 నుండి గిరిజనుల లేదా గిరిజనేతరుల భూ బదలాయింపు గిరిజనేటరులకు చెల్లదు.

గిరిజనుల, గిరిజనేతరులకు మధ్య నెలకొన్న భూ వివాదాల పరిష్కారానికి ఏజెన్సీ కోర్టులను ఆశ్రయించాలని ఆన్నారు.

షెడ్యుల్ ప్రాంతాల్లో పూర్తి హక్కులు గిరిజనలకు కలవు.

ఏజెన్సీ చట్టాలు ఉల్లంఘించినచో ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష, లేదా 2 వేల రూపాయలు జరిమానా లేదా రెండూ విధించవచ్చు

పెసా ( PESA) చట్టంలో ఏజెన్సీ ప్రాంతాల్లోని గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం జరిగింది. దీని ప్రకారం ఏ ప్రభుత్వ శాఖ అయినా చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి స్థానిక గ్రామ సభ తీర్మానం తప్పనిసరి .
ఈ గ్రామ సభలో గ్రామ ఓటర్లు అందరు సభ్యులే. గ్రామసభ నిర్వహణకు కావలసిన కోరం 1/3. అందులో కనీసం 50 శాతం గిరిజనుల హాజరు తప్పనిసరి. అట్టి తీర్మానాల నిర్ణయాలను నాలుగు వారాల లోపు సంబంధిత శాఖకు సమర్పించాలి.

ఈ సందర్భంగా మంగళవారం సాయంత్రం నిర్వహించిన సమావేశంలో తహసీల్దార్లు, ఎంపీడీవో, ఎంపీఓ, ఎస్డిసి, తదితర సిబ్బందికి ఇట్టి వాటి పై పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వార అవగాహన కల్పించి గిరిజనుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా చూడాలని ఆదేశించారు .

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!