— రూ 11000/- నగదు, పేకాట ముక్కలు స్వాధీనం….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
బుధవారం స్థానిక నెహ్రూచౌక్ కాటన్ మార్కెట్ యార్డ్ ఏరియాలోని స్మశాన వాటిక లో పేకాట ఆడుతున్నట్టుగా వచ్చిన సమాచారం రావడం తో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి ఆధ్వర్యంలోని బృందం పక్కాగా దాడి చేసి నలుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేశారు.
స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తితెలిపిన వివరాల ప్రకారం నెహ్రు చౌక్ కాటన్ మార్కెట్ యార్డ్ సమీపంలో కొందరూ వ్యక్తులు పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడం తో వెళ్లి చూడగా నాల్గురు వ్యక్తులు పేకాట ఆడుతుండగా, అందులో 1) కొప్పుల మహేందర్ (36) s/o మల్లేష్
2) షేక్ గులాబ్ (55) s/o మౌలా సాబ్
3) అమర శెట్టి రాకేష్ s/o రాములు అనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.
ఇర్ఫాన్ అలియాస్ చొడి అనే నిందితుడు పోలీసులని చూసి పరారయ్యడు తెలిపారు. పట్టుబడిన వారి వద్ద నుండి రూ.11,000/- నగదు తో పాటు పేకాట ముక్కలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ నలుగురి పై రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కొనసాగించడం కోసం అప్ప చెప్పడం జరిగిందని తెలిపారు.
ఈ ఆపరేషన్లో స్పెషల్ బ్రాంచ్ ఎస్ ఐ లు కె విట్టల్, అశోక్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Recent Comments