Friday, May 23, 2025

అదిలాబాద్: బాధితుని వివస్త్రున్ని చేసి కొ*ట్టిన నిందితులు

*రౌడీయిజాన్ని  ఉక్కు పాదంతో అనేచివేస్తాం – ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి.*

*చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై పోలీసు చర్యలు తప్పవు.*

*ముకుమ్మడి దా.డి, కిడ్నాప్ కేసులో 9 మంది పై కేసు నమోదు, ఆరుగురి అరెస్ట్.*

*మూడు ఆటోలు, మూడు సెల్ ఫోన్లో స్వాధీనం.*

*బాధితుని వివస్త్రున్ని చేసి కొట్టిన నిందితులు.*

*ప్రధాన నిందితుడు షేక్ సలీం @ కైంచి సలీం అరెస్టు కోసం ప్రత్యేక బృందం ఏర్పాటు.*

*ఆలస్యంగా ఫిర్యాదుతో కేసు నమోదు, దర్యాప్తు.*




రిపబ్లిక్ హిందుస్థాన్, అదిలాబాద్ :
ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో ఎలాంటి రౌడీయిజాన్ని నిర్వహించకుండా ఉక్కు పదంతో అణచివేస్తామని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు. రౌడీయిజాన్ని నిర్వహిస్తే గాని, చట్టాన్ని చేతిలో తీసుకున్న వారిపై కఠిన పోలీసు చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.

*వివరాలలో*
A1) షేక్ ఇజాస్ s/o షేక్ రోషన్, బంగారిగూడ,.
A2) షేక్ సలీం @ కైంచి సలీం, బంగారిగూడ. (పరారీ)
A3)షేక్ సోహెల్ @ పాడు, మసూద్ నగర్,
A4) రాహేల్ (పరారీ)
A5) షేక్ ముజీబ్., @ ముజ్జు బంగారిగూడ.
A6) హసీబుల్లా @ లతీఫ్, ఖానాపూర్.
A7) అమర్ ఛాఉస్, మహాలక్ష్మి వడ.
A8) సయ్యద్ జుబేర్, ఖానాపూర్.
A9) సలీం (పరారీ)

ఈనెల 26వ తారీఖున స్థానిక అదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు బంగారిగూడకు చెందిన బాధితుడు సయ్యద్ జహీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, విచారణ చేపట్టగా. జనవరి 8 2025 వ తారీఖున
అదిలాబాద్ వినాయక చౌక్  ప్రాంతం నందు బాధితున్ని A1 షేక్ ఇజాజ్ అనే వ్యక్తి ఆటోలో కిడ్నాప్ చేసి A2 షేక్ సలీం, ఇంటిలో బంధించి బాధితున్ని వివస్త్రున్ని చేసి 9 మంది నిందితులు కలిసి కొట్టడం జరిగిందని తెలిపారు. ఈ వ్యవహారం అంతా వీడియోలలో చిత్రీకరించి సోషల్ మీడియాలలో పోస్టల్ చేసి బాధితుని అవమాన పరచడం జరిగింది అని తెలిపారు. బాధితుడు ఆలస్యంగా ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఉదాంతాన్ని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి వివరించారు. బాధితున్ని తీవ్రంగా బాధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామంటూ బెదిరించిన వీరందరి పై కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోల ఆధారంగా మరియు బాధ్యతలు ఫిర్యాదు మేరకు అవమానించిన కొట్టిన కిడ్నాప్ చేసిన వారందరిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు. వీరందరిపై ఆదిలాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ నందు  క్రైమ్ నెంబర్ 84/25 తో అండర్ సెక్షన్ 126(2),127(2), 140(3) ,133,115(2),351(3) బి.ఎన్.ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడి దర్యాప్తు జరుగుతుందని తెలిపారు. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమేనని, ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి హెచ్చరించారు. సంఘ వ్యతిరేక కార్యక్రమాలు, చట్ట వ్యతిరేక పనులు, చట్టాన్ని చేతిలోకి తీసుకున్న వారందరిపై పోలీసు చర్యలు తీసుకుంటూ కేసులు నమోదు చేయబడతాయని తెలియజేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు A2 షేక్ సలీం @ కైంచి సలీం పై ఇదివరకే ఆదిలాబాద్ జిల్లా నందు మర్డర్ కేసు మరియు ఆమ్స్ కేసు నందు  నిందితుడుగా ఉన్న విషయాన్ని తెలియజేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇతని అతి త్వరలో పట్టుకోవడం జరుగుతుందని తెలియజేశారు.


Discover more from republichindustan.in

Subscribe to get the latest posts sent to your email.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి