రేషన్ కార్డు డేటా ఎంట్రీ రెండు రోజుల్లో పూర్తి చేయాలి : జిల్లా పాలనాధికారి రాజర్షి షా.
రేషన్ కార్డు డేటా ఎంట్రీ, ఇందిరమ్మ ఇళ్ళు , పైలెట్ ప్రజావాణి బహిరంగ విచారణ లపై సోమవారం సాయంత్రం జిల్లా పాలనాధికారి రాజర్షి షా
టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ADILABAD : ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కు సంబంధించి ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం పూర్తి వివరాలను డేటా ఎంట్రీ ద్వారా రెండురోజుల్లో పూర్తి చేయని పక్షంలో కొన్ని చోట్ల డేటా ఎంట్రీ చాలా నెమ్మదిగా కొనసాగడం , నిర్లక్ష్యం వహిస్తున్న సంబంధిత తహసీల్దార్ల పై చర్యలు తీసుకోవడం జరుగుతుందని
హెచ్చరించారు.
జనవరి 26 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజాపాలన గ్రామ, వార్డు సభల్లో స్వీకరించిన అర్జీలను తప్పులు దొర్లకుండా డేటా ఎంట్రీ ఇచ్చిన గడువులోగా పూర్తి చేయాలని ఆన్నారు.
మొత్తం 41080 రేషన్ కార్డులు కొత్తవి, పాతవి కలిపి ఇందులో 13 149 న్యూ రేషన్ కార్డ్స్ డేటా ఎంట్రీ పూర్తి, 4830 మెంబర్ ఎడిషన్ డేటా ఎంట్రీ చేయడం జరిగిందని ఇప్పటి వరకు 43 శాతం పూర్తి చేయడం జరిగిందని, అనుభవం గల ఆపరేటర్లు, పంచాయితి సెక్రటరీలను నియమించుకుని డేటా ఎంట్రీ వేగవంతం చేయాలని ఆదేశించారు.
పైలట్ ప్రజావాణి లో భాగంగా గాదిగూడ, నార్నూర్, తాంసీ , ఇచ్చోడ, సిరికొండ, గుడిహత్నూర్ లలో రేపు జరగనున్న బహిరంగ విచారణ మొదటిసారిగా మన జిల్లాలో మండల స్థాయిలో ప్రారంభమైన పైలెట్ ప్రజావాణి మంగళవారం కూడా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని పకడ్బందీగా ఫిర్యాదు దారుల నుండి సంభందిత అధికారులు అందుబాటులో ఉండి దరఖాస్తులను స్వీకరించి తక్షణ పరిష్కారానికి కృషి చేయాలనీ తెలిపారు.
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ కేంద్రాల్లో, తదితర ప్రాంతాలలో ఆన్ని ఏర్పాట్లు చేయాలని ఆన్నారు.
ఈ టెలి కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, rdo వినోద్ కుమార్, mro, mpdo, ప్రత్యేక అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
NOTE : జిల్లా పౌర సంబంధాల అధికారిణి అదిలాబాద్ గారి చే జారీ చేయనైనది.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments