స్వజాతీయతను పాటిద్దాం వి జాతీయతను వీడనాడుదాం
వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
సనాతన హిందూ ధర్మం ఆచార పరంగా ఉగాది గుడిపాడవ హిందూ బాంధవుల నిజమైన మన పండగ జనవరి 1 దండగ స్వజాతీయతను పాటిద్దాం వీ జాతీయతను విడనాడాలని సంత వైష్ణవ సదన్ నారాయణ మహారాజ్ మాదాపూర్ అన్నారు. ఆదివారం రోజు ఇచ్చోడ మండల కేంద్రంలోని విఠలేశ్వరుని ఆలయంలో సామూహిక 38వ హనుమాన్ చాలిస్ సామూహిక పారాయణం లో భాగంగా నారాయణ మహారాజ్ మాట్లాడుతూ తెలుగు నామ సంవత్సరంలనుంచీ ఉగాది తో నూతన సంవత్సరం మొదలవుతుందని అన్నారు మరాఠీ నామ సంవత్సరములు గుడిపాడవ ఆని ఇవి స్వదేశీ సంవత్సర నామమని దీనినే ఉగాది నామ సంవత్సరములు అంటారని అన్నారు. మన ఉగాది ప్రకృతి కాలంలో మార్పు స్పష్టంగా కనిపిస్తుందని సంస్కృతి సాంప్రదాయ ఆరోగ్యం అందించే మన ఉగాది పచ్చడి సేవనం జరుగుతుందని అన్నారు. జనవరి 1 ఆంగ్ల సంవత్సరానికి సంబంధించిందని కేవలం అర్ధరాత్రి తేదీ మార్పు కాలములో మార్పు ఉంటుందని అది కేవలం శాసనం ద్వారా నిర్ణయించిన రోజు అని అది అనారోగ్యానికి తెచ్చే అలవాటులను అర్ధరాత్రి తినడం తాగడం ఇతర చెడు అలవాట్లకు బానిసలుగా చేసి మనిషి యొక్క జీవితాలను నాశనం చేసేది డిసెంబర్ 31 అన్నారు ప్రతి ఒక్కరూ తాగుడు మాంసం తినడం మా పాపమని ప్రతి ఒక్కరూ ఈ చెడు వ్యసనాలు నుంచి బయటపడి భక్తి మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని అప్పుడే వారికి అన్ని రకాలుగా భగవంతుని ఆశీస్సులు ఉంటాయని అప్పుడే వారికి మనశ్శాంతి కలుగుతుందని అన్నారు. ప్రతిరోజు భగవంతుని స్పందించని వారు ఇప్పటికీ దరిద్రులుగా మిగిలిపోతారని అన్నారు. ప్రతిరోజు భగవంతుని పూజిస్తూ స్మరిస్తూ ఉండేవారికి ఆపదలు భక్తుడు అండగా నిలుస్తాడని అన్నారు. సనాతన హిందూ ధర్మం యొక్క అవిశ్యకతను సంస్కృతి సాంప్రదాయాలను భక్తులకు వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫస్ట్ ఆంటీ ముందుంటుంది 31 అంటే చివరిలో ఉంటుందని మనము ఫస్ట్ లో ఉంటామని దాని అర్థమే ఉగాది అని అన్నారు అనంతరం హనుమాన్ చాలిస్ లోని 38వ వరుసలోని జో సత్ బార్ పాటకర కోయి చోట యీ బంధీ మహాసుఖ హోహి ఈ అర్థాన్ని వివరంగా వివరిస్తూ ఎవరైతే ఎల్లప్పుడూ ప్రతినిత్యం మనిషి శరీరంలో ప్రాణం శ్వాస జీవితాంతం బ్రతికున్నన్ని రోజులు హనుమాన్ చాలిస్ పారాయణం ఎవరు చేస్తారు చేస్తారు. వారికి వారి కుటుంబానికి హనుమంతుని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని కష్టాలలో ఉన్నప్పుడు హనుమంతుడు వారి వెంట ఉండి వారి బాధలను రాకుండా కాపాడుతాడని అన్నారు. ప్రతి మనిషి తల్లి గర్భం నుంచి జన్మించినప్పుడు 100 సంవత్సరాలు బతకాలని ఆయుష్షుతో వస్తాడని కానీ బయట ప్రపంచంలో వచ్చినప్పుడు 100 సంవత్సరాలు ఆయుష్షు పూర్తి చేసుకోకుండానే 40 నుంచి 60 సంవత్సరాలు లోపు మృత్యువాత పడుతున్నారని అన్నారు. దీనికి కారణం భక్తి మార్గం దేవుడు మంచి చెడు ఆధ్యాత్మిక వైపు జ్ఞానం లేకపోవడం చెడు వ్యసనాలకు బానిస కావడం వలన మనిషి ఈ కలియుగంలో చిన్న వయసులోనే మృత్యువాత పడుతున్నారని అన్నారు. సనాతన హిందూ ధర్మ ప్రకారం ప్రతి హిందువులు చెడు వ్యసనాలు చెడు అలవాట్లను మానేసి సన్మార్గంలో నడిచి దేవుని భక్తికి పాత్రులై ఎన్ని సంవత్సరాలు బతుకుతాము అన్ని రోజులు స్వామి భక్తిని హనుమాన్ చాలీసా ను విడనాడ వద్దని భక్తుల్ని కోరారు. ఎవరైతే భక్తి మార్గంలో ఉంటారు వారికి ఎటువంటి రోగాలు భూతపిశాచి రోగాలు రావని వారి కుటుంబము పిల్లలు భగవంతుడు మంచి భవిష్యత్తు ఇస్తాడని అన్నారు. ఈ కార్యక్రమంలో 700 మంది పైగా భక్తులకు హాజరై సామూహిక హనుమాన్ చాలీసా పారాయణము లింగాష్టకం పారాయణం చేశారు. అనంతరం భక్తులకు అన్నదాత వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వహణ భక్తులు మౌళి మహిళా భక్తులు యువతి యువకులు తదితరులు భక్తులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments