– ఆన్లైన్ వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడిన బ్యాంకు సిబ్బంది బ్యాంకుకె కన్నెం వేశారు…..!
— ప్రధాన నిందితుడు అరెస్ట్, రూ 98,15,419/- రికవరీ చేసిన పోలీసులు….
ఎడిసిసి బ్యాంకు బేలా బ్రాంచి రూ. 2.85 కోట్ల కుంభకోణం వివరాలు వెల్లడించిన ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి……
🔶 యువత ఆన్లైన్ వ్యసనాలకు దూరంగా ఉండాలని జిల్లా ఎస్పీ సూచన….
రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ :
ఎడిసిసి బ్యాంక్ బేలా బ్రాంచిలో జరిగన కుంభకోణం వివరాలను శనివారం జిల్లా కేంద్రంలోని స్థానిక పోలీసు హెడ్ క్వార్టర్ లో జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి పత్రికా సమావేశం నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తేదీ 13.03.2022 రోజున ఎడిసిసి బ్యాంక్ ఆదిలాబాద్ యొక్క అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అయినా గడ్డం శ్రీనివాస్ గారు బెల పోలీస్ స్టేషన్ లో లిఖితపూర్వకంగా ఏ డి సి సి బ్యాంక్ బేలా బ్రాంచ్ రూపాయలు 2,85,00,000/- అక్రమంగా ఎలాంటి వోచర్లు లేకుండా డబ్బులు తారుమారు అయినట్లు ఫిర్యాదు చేసినారు. పోలీసులు CR No.23/2022 u/s 420, 409 IPC సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టినట్లు పేర్కొన్నారు.
విచారణలో భాగంగా బ్యాంకు సిబ్బందిని విచారించగా బేలా బ్యాంకు బ్రాంచి ఉద్యోగి అయిన స్టాఫ్ అసిస్టెంట్స్ శ్రీపత్ కుమార్ అనే ఉద్యోగి ఆన్లైన్ బెట్టింగ్ కు అలవాటు పడి దొప్తల పిఏసిఎస్ , బేల పి ఏ సి ఎస్ సొసైటీల పేరు మీద ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి ఎలాంటి లావాదేవీల వోచార్లు, గాని సంబంధిత పత్రాలు లేకుండా బ్యాంకులో పనిచేసే బ్యాంక్ మేనేజర్ మరియు అసిస్టెంట్ మేనేజర్ ల యొక్క అనుమతి లేకుండా వారిని నమ్మించి వారి పాస్వర్డ్ వాడుకొని, ఫేక్ లోన్ అకౌంట్ ల ద్వారా అతని మరియు అతని కుటుంబ సభ్యులు అయినా భార్య హిమబిందు, మరదలు దివ్య, బావ నారాయణ, అత్త పెంట రాదా ఎడిసిసి బ్యాంక్ అకౌంట్లలో మొత్తం రూపాయలు 2,85,00,000.00 లో ట్రాన్స్ఫర్ చేయడం చేసినట్లు పేర్కొన్నారు.
నిందితుడు శ్రీపత్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.
అదేవిధంగ నిందితుడు అతని యొక్క సహా ఉద్యోగులు అయినా బండి రమేష్, ఎస్ ప్రవీణ్, జి ప్రవీణ్ , రాహుల్, సవిత, ప్రణీత , వేణుగోపాల్ నితిన్ , రమేష్ వాళ్ళ యొక్క అకౌంట్లలోకి నగదు బదిలీ చేయడం జరిగినది పోలీసులు గుర్తించి వారి అందరి అకౌంట్లను వెంటనే ఫ్రీజ్ చేసి వారి అకౌంట్ లో ఉన్న రూపాయలు 37,97,419 /- లను ఏ డి సి సి బ్యాంక్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగినదని తెలిపారు.
ఏడిసిసి బ్యాంక్ ఉద్యోగుల నుండి రూ.60,18,000 రికవరీ చేసి బ్యాంకు కుట్రాన్స్ఫర్ చేయడం జరిగినదని తెలిపారు. నిందితుల వద్ద నుండి మొత్తం రూపాయలు 98,15,419.00 రికవరీ చేసినట్లు తెలిపారు.
శ్రీపత్ కుమార్ ఆన్లైన్ బెట్టింగ్ లో సత్యదేవ్ టెక్నాలజీ మరియు పూనం భౌతిక్ , నేహా లల్వని , గోపీచంద్ మరియు ఇతర బెట్టింగ్ ఏజెన్సీలలో రూపాయలు 1,40,05,106.00 లను బెట్టింగ్ పెట్టి పోగొట్టుకోన్నారు. అతని సహ ఉద్యోగి అయిన బండి రమేష్ రూపాయలు 26,60,000 అతని జల్సాలకు వాడుకోవడం జరిగినది మరియు శ్రీపత్ తన జల్సాలకు రూ.20,00,000 రూపాయలు వాడుకున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ యువతకు ఆన్లైన్ వ్యసనాల వల్ల జీవితాలకు ఒరిగేదేమీ లేదని, వీటి బారిన పడి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని సూచించారు. ఈ సమావేశంలో డిఎస్పి ఎన్ఎస్వి వెంకటేశ్వరరావు, జైనథ్ సిఐ కొల నరేష్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ జె కృష్ణమూర్తి, ఎస్సై అన్వర్ ఉల్ హక్, బేల ఎస్ఐ బి కృష్ణ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments