రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ బ్యూరో :
పాక్షికంగా మతిస్థిమితం లేని మహిళపై మానభంగ ప్రయత్నం చేసిన వ్యక్తికి 5 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష, రూ. 8000/- జరిమానాను విధిస్తూ మహిళ కోర్టు న్యాయమూర్తి జె మైత్రేయి తీర్పు విలువరించారు. ఈ సందర్బంగా న్యాయమూర్తి కీలక వాఖ్యలు చేశారు. కఠినమైన శిక్ష లతో నేర ప్రవృత్తి తగ్గుతుందని అన్నారు.
కేసు, తీర్పు…. వివరాలు ఇలా ఉన్నాయి…
ఆదిలాబాద్ పట్టణానికి చెందిన కొంతవరకు మతిస్థిమితం లేని మహిళ (22) సంవత్సరాలు , తేది 13.11.2018 రోజున రాత్రి భోజనం చేసి ఇంటి ఆవరణ లో గల గద్దెపై కూర్చుని ఉండగా, తన తల్లి ఇంట్లో పని పూర్తి చేసుకుని వచ్చి చూడగా తన కూతురు (బాధితురాలు) కనపడకపోయేసరికి ఇంటి చుట్టుపక్కల వెతికి చూడగా, పనికి వెళ్లి తిరిగి వచ్చిన భర్తకు తెలుపుతుండగా, వారి కూతుర్ని అదే ప్రాంతంలో నివాసముంటున్న ముగ్గురు వ్యక్తులు ఇంటికి తెచ్చి తల్లిదండ్రులకు అప్పగిస్తూ జరిగిన విషయం చెప్పారు.
తమ కూతురు తన ఇంటి ఆవరణలో ఉన్న గద్దెపై కూర్చుని ఉండగా నేరస్తుడు షేక్ ఖదీర్ (35) s/o షేక్ ఇసాక్ సుందరయ్య నగర్ కు చెందిన డ్రైవర్, అనే వ్యక్తి తన చెయ్యి పట్టుకుని ఆమెను పొదల్లోకి తీసుకెళ్ళి, కింద పడుకోబెట్టి, ఆమెను అత్యాచారం చేయడానికి ప్రయత్నించేను , ఆమె కేకలు అరుపులు విని చుట్టుపక్కల కాలకృత్యాలకు వెళ్లిన మగ వ్యక్తులు ఆమె వద్దకు వెళ్లగా నేరస్తుడు షేక్ ఖదీర్ తన పాయింట్ అక్కడే వదిలి పారిపోయాడు. నేరస్తుడు అదే కాలనీకి చెందిన వాడు కావున ప్రత్యక్షసాక్షులు ఆయనను గుర్తు పట్టి బాధితురాలు తల్లిదండ్రులకు తెలపగా, తెల్లవారున, తేది 14.11.2018 న తండ్రి దరఖాస్తు చేయగా అప్పటి ఆదిలాబాద్ రెండవ పట్టణ పోలిస్ స్టేషన్ ఎస్ఐ దశరథ్ కేసు నమోదు చేసి cr no 318/2018 u/sec 376 r/w 511 IPC, 354(A)(I) IPC, కింద కేసు నమోదు చేసి సాక్షులను విచారించిన అనంతరం చార్జిషీటు దాఖలు చేశారు.
ఇట్టి కేసులో కోర్టు డ్యూటీ అధికారి ఏం శ్రీనివాస్ సాక్షులను ప్రవేశపెట్టగా ప్రత్యేక పి పి ఎం రమణారెడ్డి 9 మంది సాక్షులను విచారించి కేసు రుజువు చేయగా, మహిళా కోర్టు జిల్లా న్యాయమూర్తి జె మైత్రేయి నేరస్తునికి శిక్ష విధిస్తూ 376 R//W 511 IPC మరియు 354 IPC కలిపి 5 సం”లు కఠిన కారాగార శిక్ష, రూ.8000/- జరిమానా, కట్టని పక్షంలో ఒక సంవత్సర సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పునిచ్చారు.
ఇట్టి విషయంలో పిపి ఎం రమణారెడ్డి ని, కోర్టు లైజన్ అధికారి ఎం గంగా సింగ్, రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కోర్టు డ్యూటీ అధికారి ఎం శ్రీనివాస్ లను జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments