రిపబ్లిక్ హిందూస్థాన్ , ఇచ్చోడ :ఇచ్చోడా ఆత్మ ఛైర్మన్ నరాల రవీందర్ వేడుకలను టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఇచ్చోడ డివిజన్ ఆత్మ చైర్మన్ నరాల రవీందర్ జన్మదిన వేడుకలను సోమవారం ఇచ్చోడలోని హీరో షో రూమ్ లో టీఆర్ఎస్ మండల కన్వీనర్ ఏనుగు కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఆత్మ చైర్మన్ కు తినిపించి, పుట్టిన రోజు శుభా కాంక్షలు తెలిపారు. ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
అనంతరం నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షులు ముస్తాఫా, సిరిచేల్మ, గేర్జము గ్రామాల ఉప సర్పంచులు అబ్దుల్ అజీమ్, బలగం రవి కుమార్, నాయకులు వెంకటేష్, రాథోడ్ ప్రకాష్, గణేష్, దాసరి భాస్కర్, నర్వాడే రమేష్, ముస్కు గంగారెడ్డి, కలీమ్, మహ్మద్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Recent Comments