రంగారెడ్డి జిల్లా, శనివారం: జాబ్ క్యాలెండర్‌ను అమలు చేయాలంటూ నిరుద్యోగులు శాంతియుతంగా చేపట్టిన నిరసనపై పోలీసులు లాఠీచార్జ్ చేసి అక్రమంగా అరెస్టులు చేయడాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని రంగారెడ్డి జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వేముల మల్లేశ్ వెల్లడించారు.

శనివారం సాయంత్రం శివరాంపల్లిలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పాలనలో ఉద్యోగాలు వస్తాయని నిరుద్యోగ యువత ఎంతో ఆశతో ఎదురుచూసిందన్నారు. అయితే ఫలితం లేకపోవడంతో ‘చలో అశోక్ నగర్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుని నిరుద్యోగులపై లాఠీచార్జ్ చేసి అరెస్టులు చేయడం దారుణమని ఆయన విమర్శించారు.
ఈ ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలని వేముల మల్లేశ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు అండగా బీజేపీ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. అలాగే విద్యార్థులపై లాఠీచార్జ్‌కు బాధ్యులైన పోలీసు అధికారులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.


Recent Comments