ఆదిలాబాద్: ఇచ్చోడ మండల ఏంఐఏం పార్టీ నూతన కార్యవర్గాన్ని శనివారం ఆదిలాబాద్ ఏంఐఏం టౌన్ ప్రెసిడెంట్ నజీర్ హైమద్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఏంఐఏం పార్టీ ఇచ్చోడ మండల అధ్యక్షునిగా షేక్ జావిద్, జనరల్ సెక్రటరీగా షేక్ సజీద్, ట్రెజరర్ గా సుఫియాన్, జాయింట్ సెక్రటరీలుగా షేక్ ఆర్షద్, షేక్ ఆథర్, అఫ్రోజ్, సదీఖ్ లను ఎన్నుకున్నారు. వారు మాట్లాడుతూ.. మండలంలో ఏంఐఏం పార్టీ బలోపితం కోసం కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ తరపున పోరాడుతామన్నారు. అనంతరం నూతన కమిటీ సభ్యులను టౌన్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో నజీర్ హైమద్ ఘనంగా సన్మానించారు.
Recent Comments