ఆదిలాబాద్ : ఇచ్చోడ మండల కేంద్రంలో ఆదివారం (05/10/2025) ఇచ్చోడ ఆరే మరాఠ కులస్థులు స్థానిక గంగారెడ్డి గార్డెన్ లో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించుకున్నారు..
ఈ సమావేశంలో సంఘం సంక్షేమం పై, భవిష్యత్ కార్యాచరణ తదితర విషయాలపై చర్చించుకున్నారు.. ఈ సందర్భంగా జిల్లా సంఘం అధ్యక్షులు దశరథ్ పాటిల్ భోస్లే ఆధ్వర్యంలో ఆరే మరాఠ కులస్తులు అందరూ కలిసి నూతన కమిటీని ఎన్నుకున్నారు..ఇచ్చోడ పట్టణ ఆరే మరాఠ సంఘం అధ్యక్షులుగా సాయికిరణ్ జాధవ్, ప్రధాన కార్యదర్శి గా పౌడే అనిల్, ఉపాధ్యక్షలుగా సుభాష్ పాన్పట్టే, పరమేశ్వర్ షిండే, థోరె తానాజీ, అశోక్ భోస్లే లు, జాయింట్ సెక్రెటరీలుగా చంద్రకాంత్ కదం,డుక్రె శ్యామ్, దినేష్ గైక్వాడ్, కదం శంకర్ లు, కోశాధికారులుగా జ్ఞానేశ్వర్ గైక్వాడ్, మెండల్కర్ లక్ష్మణ్ లు, పబ్లిసిటీ సెక్రటరీగా రాము జాధవ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా సాయి లాండ్గే,శుభం పాన్పాట్టే, సుమిత్ డుక్రె, ఎగ్జిక్యూటివ్ మెంబెర్స్ గా సాయికృష్ణ పాన్పాట్టే, గాడ్గే జ్ఞానేశ్వర్, సందీప్ కదం, అశోక్ చౌహన్, అక్షయ్ సూర్యవంశీ, శివ భోస్లే లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు…

అధ్యక్షునిగా ఎన్నికైన సాయికిరణ్ జాధవ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అధ్యక్షునిగా ఎన్నుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదలు తెలుపుతూ తనకు ఇచ్చిన బాధ్యతను పూర్తి నిబద్దతతో నిర్వర్తిస్తానని, మరాఠా సమాజం సంక్షేమం కోసం, అభ్యున్నతి కోసం నిస్వార్ధంగా కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో కుల పెద్దలు శంకర్ పాటిల్ ఖరే,సూర్యకాంత్ పాటిల్ చౌహన్, డాక్టర్ మనోహర్ పాటిల్ డుక్రె, సుదర్శన్ పాటిల్ కదం, అరుణ్ పాటిల్ అగ్లవే, కోండిరాం పాటిల్ కదం, కిషన్ పాటిల్ షిండే,గంగాధర్ పాటిల్ షిండే, గంగాధర్ పాటిల్ లాండ్గే, శివరాం పాటిల్ మోరె,జ్ఞానోబా పాటిల్ కదం మరియు పెద్ద ఎత్తున ఇచ్చోడ మరాఠి కులస్థులు పాల్గొన్నారు..
Recent Comments