
దౌర్జన్యానికి పాల్పడుతూ, అటవీ అధికారుల పై దాడి చేసిన కేసులలో ప్రధాన నిందితుడిపై పిడి యాక్ట్ నమోదు – ఇచ్చోడ సీఐ బండారి రాజు
Thank you for reading this post, don't forget to subscribe!
నిందితుడు షేక్ అల్తాఫ్ అరెస్టు, చర్లపల్లి జైలుకు తరలింపు.
* షేక్ అల్తాఫ్ ఇదివరకే బెదిరింపులు, దౌర్జన్యం, ప్రభుత్వ అధికారుల పై దాడి కేసులలో ప్రధాన నిందితుడు
* ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు 11 కేసులలో ప్రధాన పాత్ర
* పదేపదే నేరాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఏర్పాటు, పీడీ యాక్ట్ నమోదు
* అసాంఘిక కార్యకలాపాలు గంజాయి, మాదకద్రవ్యాలపై ప్రత్యేక నిఘా
ఆదిలాబాద్ / ఇచ్చోడ ; బెదిరింపులకు పాల్పడుతూ, రైతుల స్థలాలను కబ్జా చేస్తూ, ప్రభుత్వ అధికారుల విధులను నిర్వర్తించకుండా వారిపై దాడులకు పాల్పడుతూ అక్రమాలకు పాల్పడుతున్న ఇచ్చోడ మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన షేక్ అల్తాఫ్ అనే వ్యక్తి ఇచ్చోడ మండలంలోని పలు గ్రామాలలో రైతులను దౌర్జన్యానికి గురి చేస్తూ, అక్రమంగా భూములను రాయించుకుంటూ, అమాయకులను మోసం చేస్తూ, అటవీ అధికారులపై పోలీసు అధికారులపై దాడులకు పాల్పడుతూ ఇప్పటివరకు ఇచ్చోడ పోలీస్ స్టేషన్ నందు పదకొండు కేసులు నమోదు చేసినట్లు ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలియజేశారు. నిందితుడు షేక్ అల్తాఫ్ ను ఈరోజు పిడి యాక్ట్ కేసులోచర్లపల్లి జైలుకు తరలించడం జరిగిందని తెలిపారు.
ఇతనిపై దౌర్జన్యం కేసులు భూములను అక్రమంగా రాయించుకున్న కేసులు ఫారెస్ట్ అధికారులపై దాడి కేసులు ఇచ్చోడా పోలీస్ స్టేషన్ నందు ఇప్పటివరకు 11 నమోదు అయినట్లు తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని ప్రభుత్వ అధికారులపై దాడులు చేసే ఇలా ఉసిగొలిపిన వ్యక్తులు దాడులకి పాల్పడిన వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తూ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమయనమైన అని ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తప్పు చేసిన వారికి జిల్లా పోలీసు యంత్రాంగం ఇలా పీడీ యాక్ట్ సైతం నమోదు చేయడానికి వెనకాడబోదని తెలిపారు. వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై రౌడీయిజం చేసే వారిపై, గంజాయి రవాణా, గంజాయితో వ్యాపారం, మాదకద్రవ్యాల వ్యాపారం మరియు ఆర్థిక నేరస్తులు వైట్ కలర్ నేరస్తులపై జిల్లా పోలీసు యంత్రాంగం నిఘా ఏర్పాటు చేసి చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటూ అణిచివేయడం జరుగుతుందని తెలిపారు.
Recent Comments