అదిలాబాద్ జిల్లా, సెప్టెంబర్ 23 : ఇచ్చోడ మండలంలో పంట పొలంలో కరెంటు వైర్ పెట్టి ఒకరి మృతికి కారణమైన కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు.
తేదీ 20న మెండడి రంబు కనిపించకుండా పోయినట్లు అతని కుమారుడు సడుమాకే సంతు బాయ్ ఫిర్యాదు చేయగా, దర్యాప్తులో రంబు ప్రమాదవశాత్తు కరెంటు వైర్ తగిలి మృతిచెందినట్లు బయటపడింది.
ఈ కరెంటు వైర్‌ను అడవి పందులను తరిమేందుకు చిక్రం పాండు ఏర్పాటు చేసినట్లు విచారణలో తేలింది. మృతదేహం బయటపడితే కేసు అవుతుందని భయపడి తన బామ్మర్ది మండాడి ఈశ్వర్ సహాయంతో శవాన్ని కడం వాగులో పడేశాడు.
పూర్తి విచారణ అనంతరం చిక్రం పాండు @ పాండురంగ్, మండాడి ఈశ్వర్‌లను ఈరోజు రిమాండ్‌కు తరలించినట్లు ఇచ్చోడ సీఐ బి రాజు తెలిపారు.
రైతులు పంట రక్షణ పేరుతో కరెంటు వైర్లు పెడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
Recent Comments