ఆదిలాబాద్ క్రైమ్ న్యూస్ : బ్రాండెడ్ బియ్యం పేరుతో పిడిఎస్ బియ్యం అమ్ముతూ ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తి అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలిపారు.
నిందితుని వద్దనుండి ఒక ఆటో, 6 క్వింటల రాయితీ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
సిఐ తెలిపిన వివరాల ప్రకారం…. నిందితుడు
షేక్ అయుబ్ ఆదిలాబాద్ చిలుకూరు లక్ష్మీ నగర్ శివాజీ చౌక్ నందు ఆంధ్ర కిరాణా పేరిట దుకాణం నడిపిస్తున్నాడు.

ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ ప్రాంతంలో ఆంధ్ర కిరాణం యజమాని నిందితుడు షేక్ అయూబ్ బ్రాండెడ్ రైస్ సంచులలో పిడిఎస్ రైస్ నింపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలో, నిందితుని అరెస్టు చేసినట్లు ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు.

ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ ఇతనిపై ఇదివరకే ఆదిలాబాద్ పట్టణంలో పలు కేసులలో నిందితుడుగా ఉన్నట్లు అమాయక ప్రజలను రాయితీ బియ్యం సంచులలో నింపి బ్రాండెడ్ పేరుతో అమ్ముతూ పట్టుబడడం జరిగిందని తెలిపారు. ఇతని వద్దనుండి ఆరు క్వింటల్లా రాయితీ బియ్యాన్ని మరియు ఒక ఆటోని సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తరచూ పదేపదే నేరాలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న సందర్భంలో ఇతని దుకాణాన్ని జప్తు చేయడం కొరకై ఆదిలాబాద్ ఆర్డిఓ గారికి సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు.
Recent Comments