ఆదిలాబాద్ : ఇచ్చోడ మండలం లోని నర్సాపూర్ సెక్టార్ పరిధిలోని మెడిగుడా సెంటర్‌లో ఈరోజు పోషణ మాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ICDS సూపర్వైజర్ జె. విమల మాట్లాడారు.

ఆమె మాట్లాడుతూ, “ప్రతి చిన్నారి, గర్భిణీ, బాలింత, కిషోర బాలికలు పోషకాహార లోపం లేకుండా ఆరోగ్యవంతులుగా ఎదగాలి. మనకు అందుబాటులో ఉన్న ఆకుకూరలు, కూరగాయలు, ధాన్యాలు, చిరుధాన్యాలు తింటే శరీరానికి అవసరమైన అన్ని రకాల పోషకాలు అందుతాయి. అలాగే పాలు, గుడ్లు, నువ్వులు, బెల్లం, వేరుశనగ, చెనగ వంటివి తీసుకుంటే రక్తహీనతను నివారించవచ్చు” అని వివరించారు.
ఈ కార్యక్రమంలో మెడిగుడా పల్లెవెలుగు డాక్టర్ కృష్ణ, ANM సురేఖ, ఆశావర్కర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Recent Comments