Tuesday, October 14, 2025

సంఘటితమై పోరాడుదాం

ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి పిలుపు

Thank you for reading this post, don't forget to subscribe!

జైనూర్: సోమవారం రోజు రోజు కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలో ఆదివాసి సేన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా  ఆధ్యక్షులు కోట్నహ్క గణపతి ఆధ్యక్షతన నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆదివాసి సేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కోవ దౌలత్ రావు మొకాశి హాజరై మాట్లాడుతు ఆదివాసి ఉనికి అస్తిత్వ రక్షణకై, లంబాడాలను ఎస్టి జాబితా నుండి తొలగించుటకై, సంఘాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఏకతాటిపై వచ్చి ఐక్య ఉద్యమ కార్యాచరణతో ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమయినదని అయన అన్నారు. ప్రస్తుతం జరుగుత్న ఉద్యమంలో  ఆదివాసి సేన నాయకులు, కార్యకర్తలు మీ మీ ప్రాంతాలలో జరిగే నిరసన, ఆందోళన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ ఆదివాసి సంఘాలు, పార్టీల నాయకులు ఐక్యం కావటానికి తన వంతు కృషి చేస్తానని ఆయన తెలిపినారు.

ఆదివాసి సమాజంలోని అన్నివర్గాల ప్రజలు ఐక్యంగా ఉండి ముందుకు సాగితే విజయం ఎంతో దూరంలో లేదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమాజం మొత్తం ఐక్యంగా ఉండి పోరాడటానికి ప్రతి ఒక్క చదువుకున్న ఆదివాసి మేధావి, అనుభవజ్ఞులు పాటుపడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఆదివాసి సేన రాష్ట్రా నాయకులు పేందోర్ విశ్వనాథ్,ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఆధ్యక్షులు రాయిసిడం జంగు పటేల్, ఆదివాసి సేన కుంరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆధ్యక్షులు కోట్నక గణపతి,ఆదివాసి సేన మంచిర్యాల జిల్లా ఆధ్యక్షులు కోట్నక గణపతి,ఆదివాసి మంచిర్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి మడవి వేంకటేష్,ఆదివాసి సేన కుంరం భీం జిల్లా ఉపాధ్యక్షులు కోడప వామన్, సిర్పూర్ (యు) మండల ఆధ్యక్షులు సోయం గుణవంత్,ఆదివాసి సేన రైతు సేన జిల్లా కన్వీనర్ వేడ్మ చంపత్ రావు,ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు పేందోర్ విశ్వనాథ్, మంచిర్యాల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మడవి వేంకటేష్,ఆదివాసి సేన అదిలాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి గేడం రమేష్,గుడిహత్నూర్ మండల ఆధ్యక్షులు సేడ్మకి భీంరావు,ఇంద్రవెళ్ళి మండల ఆధ్యక్షులు మేస్రం సుదర్శన్, బోథ్ మండల ఆధ్యక్షులు ఆడేం పోల్లన్న,బజార్హత్నూర్  మండల ఆధ్యక్షు అత్రం శ్రీకాంత్,జన్నారం మండల ఆధ్యక్షులు దుర్వ యశ్వంత్,దండేపల్లి మండల ఆధ్యక్షులు ఆత్రం జలపతి, దండేపల్లి మండల కార్యదర్శి కుంరం హన్మంతు,ఆదివాసి విద్యార్థి సేన జిల్లా కన్వీనర్ కోట్నక గణేష్,ఆదివాసి విద్యార్థి సేన జిల్లా కో కన్వీనర్ కుంరం చత్రుఘన్,ఆదిదివాసి సేన  గుడిహత్నూర్ మండల సంయుక్త కార్యదర్శి తోడషం రమేష్, ఆదివాసి సేన ఆదిలాబాద్ జిల్లా కమిటి సభ్యలు కోట్నక కేశవ్, పేందోర్ గోవింద్,పూసం సోనేరావు, తోడషం నాగోరావు తదితరులు పాల్గోన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

మీ గ్రామాల్లో నెలకొన్న సమస్యలు మాకు పంపండి
error: Content is protected !!