ePaper
Tuesday, March 10, 2026
📄 ePaper

VDC: విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు : డీఎస్పీ

📰 Generate e-Paper Clip

Thank you for reading this post, don't forget to subscribe!
  • విడీసీల ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధం. విడిసిల అక్రమాల పై కఠిన చర్యలు తప్పవు.
  • ఇప్పటివరకు 16 కేసులను నమోదు, మంగళవారం రోజు జైనథ్ మండలం ఆనందపూర్ నందు ఇసుక వేలం ఏర్పాట్లు చేసినందుకు వి డి సి లోని ఎనిమిది మంది సభ్యులపై కేసు నమోదు
  • చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరు సమానమే, విడిసిల అక్రమ వసూళ్లకు దందాలకు సెటిల్మెంట్లకు అవకాశాలు లేవు. ప్రజలు వీడీసీల వల్ల ఎలాంటి సమస్యలు ఉన్న ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించాలి

– ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి

ఆదిలాబాద్ జిల్లా క్రైమ్ న్యూస్ : గ్రామ అభివృద్ధి కమిటీలు ప్రజలకు భారంగా, ప్రజల వద్ద న్యాయస్థానాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని సంప్రదించకుండా గ్రామ అభివృద్ధి పేరుతో వసూలు చేయడం చట్ట వ్యతిరేకమని ఆదిలాబాద్ డిఎస్పి ఎల్ జీవన్ రెడ్డి తెలిపారు.

గ్రామ అభివృద్ధి పేరుట అక్రమ వసూళ్లకు పాల్పడిన వారిపై చట్ట ప్రకారంగా కేసులు నమోదు చేయబడతాయని అందులో భాగంగానే ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో ఇప్పటివరకు 16 కేసులను నమోదు చేయడం జరిగింది అని తెలిపారు. గ్రామాలలో బెల్ట్ షాపులను కళ్ళు దుకాలను ఇసుక తవ్వకాలకు అనధికారికంగా అనుమతులు ఇవ్వడం వీడీసీలకు అర్హతలు లేవని స్పష్టం చేశారు. వారి అనుమతితో చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిర్వహించే వారిపై మరియు విడీసీ లపై కేసులు నమోదు చేయబడతాయని హెచ్చరించారు.

ఎవరైనా గ్రామ అభివృద్ధి వలన ఇబ్బందులు ఎదుర్కొనే వారు దగ్గరలో ఉన్న తమ పోలీస్ స్టేషన్లను సంప్రదించాలని భవిష్యత్తులో అసాంఘిక కార్యకలాపాలకు ఎలాంటి బహిష్కరణలకు వసూళ్లకు దందాలకు వీడీసీలు పాల్పడిన యెడల కచ్చితంగా చట్ట ప్రకారం చర్యలు తప్పవని తెలియజేశారు.

ఇప్పటివరకు ఆదిలాబాద్ సబ్ డివిజనల్ పరిధిలో 16 కేసుల నమోదు కాగా అందులో జైనథ్ సర్కిల్ పరిధిలో పది కేసులు, బోథ్ సర్కిల్ పరిధిలో 2 కేసులు, ఆదిలాబాద్ రూరల్ సర్కిల్ పరిధిలో 4 కేసులో నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

ఈరోజు జైనథ్ మండలం ఆనందపూర్ గ్రామానికి చెందిన 8 మంది పై కేసు నమోదు చేయడం జరిగిందని ఇసుక వేలంపాటకు ప్రయత్నించడం కారణంగానే వీరిపై ఎక్స్ట్రాక్షన్ కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!