సెప్టెంబర్ 14, 2025, ఆదిలాబాద్ జిల్లా : 2000-2001 SSC బ్యాచ్‌కు చెందిన మిత్రులు తమ సహచరుడు బైరి విలాస్ ఆడేగామా-కె అకాల మరణం చెందిన విషాదకర సంఘటనలో ఆయన కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు.
మిత్రులు కలసి రూ.60,002 నగదు, ఒక క్వింటాల్ 50 కేజీల బియ్యం, 5 కిలోల చక్కెరను విలాస్ కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మిత్రులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, “మేము ఎల్లప్పుడూ మీతోనే ఉన్నాం” అని ధైర్యం చెప్పారు. అలాగే విలాస్ గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
ఇక, గతంలో కూడా ఇదే బ్యాచ్‌కు చెందిన భోజన్న, నాగరాజ్ మిత్రులు అకాల మరణం చెందిన సందర్భంలో వారి కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం అందజేసినట్లు మిత్రులు గుర్తుచేశారు.
Recent Comments