* నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు, గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్ బాక్సులు స్వాధీనం
* కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు ఆదిలాబాద్ ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
– వన్ టౌన్ సీఐ బి సునీల్ కుమార్
ఆదిలాబాద్ : బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజీ చౌక్ నందు నకిలీ వి గార్డ్ ఎలక్ట్రిక్ వైర్లు మరియు గోల్డ్ మెటల్ ఎలక్ట్రిక్ సాకెట్లు విక్రయిస్తున్నారని విశ్వసనీయ సమాచారం మేరకు కంపెనీ ప్రతినిధులు నిందితుడు
దేవాసి హర్షన్ తండ్రి పేరు వినరాం, వయస్సు:32, కృష్ణ ఎలక్ట్రికల్ షాప్ యజమాని, ఆదిలాబాద్, షాప్ నందు కొనుగోలు చేయగా వారికి నకిలీ సామాగ్రి ఇచ్చి మోసం చేయడం జరిగిన ఘటనలో కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేయగా, నిందితున్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని ఆదిలాబాద్ ఒకటో పట్టణ సీఐ బి సునీల్ కుమార్ తెలియజేశారు.
Recent Comments