ఆదిలాబాద్: ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ శాంతి నగర్ ఆదిలాబాదు లో ఆదివారం రోజున సేలవు కావడంతో
ఒక రోజు ముందు హిందీ భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ .సంగీత గ , ఆచార్యులు సంతోష్ కుమార్, రమాకాంత్ గౌడ్ , హిందీ సహాయ ఆచార్యులు రాథోడ్ శ్రావణ్,డా. రాధా, సలేహ కళాశాల సిబ్బంది జాతిపిత మాహత్మా గాంధీజీ ,హిందీ కవి ప్రేమ్ చంద్ చిత్రపటాన్ని పూలమాలలు వేసి నివాళులర్పించారు.
విద్యార్థులకు హిందీ భాషా ప్రాముఖ్యతను తెలియజేసేలా ఉపన్యాసాలు, పాటలు,హిందీ దోహాలు,కవితల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు.
ఈ కార్యాక్రమం ఉద్దేశించి ప్రిన్సిపల్ డాక్టర్ .సంగీత
మాట్లాడుతు జాతీయ స్థాయిలో ఉద్యోగాలు పొందడంలో హిందీ భాష కీలకమని, 1949 సెప్టెంబర్ 14న మన జాతీయ భాషగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందని అన్నారు. హిందీ అధ్యాపకులు రాథోడ్ శ్రావణ్ హిందీ భాష ప్రాముఖ్యతను, స్వాత్యంత్ర సమరంలో హిందీ భాషను ఆయుధంగా చేసుకోని గాంధీజీ నాయకత్వంలో భారతీయులు చేసిన పోరాటంను వివరించారు. అనంతరం హిందీ అధ్యాపకులకు శాలువాతో సన్మానించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల బోధన బోధనేతర సిబ్బంది
విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
Recent Comments