
*627 గంజాయి మొక్కలు స్వాధీనం
*గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులో గంజాయి మొక్కలు పండిస్తున్న తండ్రి, ఇద్దరు కొడుకులు
* రెండు కేసులు నమోదు, ఒకరీ అరెస్ట్, ఇద్దరు పరారీ
* బహిరంగ మార్కెట్లో పట్టుకున్న గంజాయి విలువ 62.7 లక్షలు*
* సిసిఎస్, ఇచ్చోడా సర్కిల్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్
* ప్రభుత్వ పథకాలు రాకుండా సిఫార్సు,*
*గంజాయి పై సమాచారం అందించిన వారికి రివార్డులు, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.*
*వివరాలను వెల్లడించిన ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్.*
ఆదిలాబాద్: జిల్లాలో గంజాయిని పూర్తిగా రూపుమాపే దిశగా జిల్లా పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కష్టపడుతుందని, జిల్లాలో గంజాయి పండించే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ తెలియజేశారు., జిల్లాను గంజాయి రహిత జిల్లాగా నిర్మించడం జరుగుతుందని దానికి ప్రజల ప్రతి ఒకరి సహకారం తప్పనిసరి అని జిల్లా ఎస్పీ తెలిపారు.
శుక్రవారం రోజు మధ్యాహ్నం గుడియాత్నూర్ పోలీస్ స్టేషన్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, …
గురువారం స్థానిక గుడిహత్నూర్ మండలం తోషం గ్రామ శివారులో తోషం గ్రామస్తులైన నిందితులు తమ పంటచేళ్లలో 627 (2-3feet height) ఉన్న గంజాయి మొక్కలను పండిస్తుండగా సిసిఎస్ మరియు ఇచ్చోడ సర్కిల్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి పట్టుకోవడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అత్యాశతో గంజాయి పండించడం జరిగిందని,
నిందితులైనా
A1) మర్సుకోల దేవరావు (55) అరెస్ట్ చేసినట్లు , A2) మర్సుకోల జగన్ (పరారీ), A3) మర్సుకోల నగేష్ (పరారీ) ఉన్నట్లు తెలిపారు.
వీరిపై గాంజాయ్ చట్టం ఎన్ డి పి ఎస్ ప్రకారం గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో రెండు కేసులు నమోదు అయినట్లు తెలిపారు. జిల్లాలో గంజాయి నిర్మూలనకు ఎన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన పెడచెవిన పెడుతూ ఇలాంటి గంజాయి మొక్కల పెంపకం చేస్తున్న వారిపట్ల జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరిస్తుందని తెలిపారు. వీరికి ప్రభుత్వం పథకాలు రాకుండా సిఫార్సు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇందులో మొదటి నిందితుడు దేవరావును అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని మిగిలిన ఇద్దరిని పట్టుకోవడంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి అన్వేషించడం జరుగుతుందని తెలిపారు. గంజాయి యువత భవిష్యత్తును, జీవితాలను నాశనం చేస్తుందని, గంజాయి వల్ల కలుగు అనర్ధాలు ఎన్నో ఉన్నాయని, గాంజాయ్ సేవించడం, వర్తకం చేయడం, రవాణా చేయడం, పండించడం లాంటివి చేయకూడదని, ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు.
పట్టుకున్న గంజాయి మొక్కల విలువ దాదాపు బహిరంగ మార్కెట్లో 62 లక్షల 70 వేల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. ఒక్కొక్క మొక్క పదివేల చొప్పున బహిరంగ మార్కెట్లో విక్రయించడం జరుగుతుందని గంజాయి పండించడం పట్ల, మాదకద్రవ్యాల పట్ల జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తతతో ఉంటూ గంజాయిని జిల్లా నుండి తరిమి వేయడం లక్ష్యంగా విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ప్రజలందరికీ జిల్లా ఎస్పీ సూచనలు ఇస్తూ గంజాయి పై ఎలాంటి సమాచారం ఉన్న 8712659973 నంబర్ కి వాట్సాప్ ద్వారా సమాచారం అందించవచ్చని సమాచారం జిల్లా ఎస్పీ గారికి నేరుగా అందించబడుతుందని తెలిపారు. గంజాయి పై సమాచారం అందించిన వారికి ప్రత్యేకంగా రివార్డులను అందజేయడం జరుగుతుందని సమాచారం తెలియజేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
ఇప్పటివరకు ఈ సంవత్సరం జిల్లాలో 120 గంజాయి కేసులు నమోదు కాగా అందులో 40 కిలోల వరకు ఎండు గంజాయి, 600 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకున్నట్లు, ఈ కేసులలో 240 మంది వరకు నిందితులపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పి కాజల్ సింగ్ ఐపీఎస్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ పి చంద్రశేఖర్, ఇచ్చోడా సీఐ బండారి రాజు, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది, సిసిఎస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Recent Comments