* గుడిహత్నూర్ నందు ఇరు వర్గాలపై రెండు కేసులు నమోదు
* రెండు కేసుల నందు ఏడుగురు నిందితుల అరెస్టు రిమాండ్ తరలింపు
* ఎలాంటి సందర్భంలోనైనా దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి న్యాయపరంగా పోరాడాలని
— ఇచ్చోడా సిఐ బండారి రాజు
ఆదిలాబాద్ / ఇచ్చోడ : మొదటి కేసు వివరాలు…. ఎలాంటి సందర్భంలోనైనా దాడులకు పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తప్పవు, సమాచారాన్ని పోలీసుల దృష్టికి తీసుకువచ్చి న్యాయపరంగా పోరాడాలని ఇచ్చోడా సిఐ బండారి రాజు సూచించారు.
మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ప్రవర్తించిన ఘటనలో రెండు కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.
మొదటి కేసు వివరాలు…
09.09.2025 రాత్రి 23.00 గంటలకు గుడిహత్నూర్ గ్రామానికి చెందిన మొహమ్మద్ సమీనా అనే మహిళ గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదులో, అదే రోజు సాయంత్రం 19.30 గంటలకు తన భర్త మద్యం తాగి ఇంటికి వచ్చి ఇంటి పనుల విషయంలో తగవు పెట్టుకున్నాడని తెలిపారు. ఈ సమయంలో సోను, బలేరావు సునీల్, కేంద్రే రాజేశ్వర్, నాగ్రోజే నామదేవ్, , నిఖిల్, ఆడే మోహన్, కడం సాయి @ సాయినాథ్ అనే ఆరుగురు మరియు మరికొందరు ఆమె ఇంటికి వచ్చి, గణేశుడిని అవమానించే విధంగా దూషణలు చేయడంతో పాటు, తమ మతాన్ని కూడా దూషించారని తెలిపారు. అనంతరం వారు ఆమె భర్తను కొట్టి, లాగి బయటకు తీసుకెళ్లి డ్రెయినేజీలో తోసి, బట్టలు చింపివేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. భర్తను కాపాడేందుకు తాను మరియు తన కుమారుడు మజీద్ ప్రయత్నించగా, ఆ వ్యక్తులు తన బట్టలు చింపి, కుమారుడిని కూడా కొట్టారని ఫిర్యాదులో తెలిపారు. ఈ ఘటనపై గుడిహత్నూర్ ఎస్సై శ్రీకాంత్ కేసు నమోదు చేసి, నిందితులు బలేరావు సునీల్, కేంద్రే రాజేశ్వర్, నాగ్రోజే నామదేవ్, , నిఖిల్, ఆడే మోహన్, కడం సాయి @ సాయినాథ్ లను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విదిస్తూ జైలుకు పంపనైనది .
రెండవ కేసు వివరాలు…
అలాగే, అదే రోజు రాత్రి 23.30 గంటలకు గుడిహత్నూర్ గ్రామానికి చెందిన బలేరావు సునీల్ (42 ఏళ్లు, కూలీ, ఎస్సీ మహర్) గారు కూడా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదులో, మొహమ్మద్ హైమాద్ తరచూ మద్యం సేవించి తన భార్యతో గొడవలు పెట్టుకుంటూ, హిందూ దేవుళ్లను అవమానించేలా దూషణలు చేస్తున్నాడని పేర్కొన్నారు. 09.09.2025 సాయంత్రం హైమాద్ గణపతి భగవంతున్ని అవమానించే విధంగా దూషణలు చేయగా, తాను వీడియో తీసి తన పరిచయులకు పంపినట్లు తెలిపారు. తరువాత రాజేంద్ర ప్రసాద్, మోహన్, నిఖిల్ లతో కలిసి హైమాద్ ఇంటికి వెళ్లి ప్రశ్నించగా, హైమాద్ మరియు అతని భార్య సమీనా వారిని దూషించి, దాడి చేశారని ఫిర్యాదులో వివరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, నిందితుడు (A1) హైమాద్ ను అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ విదిస్తూ జైలుకు పంపనైనది ఎవరైనా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టి శాంతి బధ్రతలకు విగతం కలిగించే విధంగా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోబడును.
ప్రజలందరూ మతసామరస్యాన్ని పాటించాలని, ఎవరి మతాన్ని ఎవరు కూడా కించపరచకుండా అవమానించకుండా ఉండాలని, వారి వారి దైవాలను ఎలాంటి దూషణలకు చేయకుండా ఉండాలని, అలాంటివి ప్రజల దృష్టికి వస్తే జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సంప్రదించాలని పోలీసులు సరైన సమయంలో స్పందించి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఇచ్చోడ సీఐ బండారి రాజు తెలియజేశారు.
Recent Comments