
అదిలాబాద్ జిల్లా, ఆగస్టు 24: స్థానిక కెఆర్‌కె కాలనీలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆదేశాల మేరకు డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉదయం 5 గంటల నుండి కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 200 మంది పోలీసు సిబ్బంది, 40 మంది మహిళా పోలీసులతో జరిగిన ఈ తనిఖీలో 70 ద్విచక్ర వాహనాలు, 15 ఆటోలు, 1 కారు స్వాధీనం చేశారు. నార్కోటిక్ డాగ్ రోమా సహాయంతో 3 గంజాయి మొక్కలు (1 అడుగు ఎత్తు), 10 గ్రాముల ఎండు గంజాయి, 29 క్వార్టర్ లిక్కర్ బాటిల్స్ లభించాయి. నిందితులపై కేసు నమోదు చేశారు.









డిఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజల భద్రత కోసం ఈ ఆపరేషన్ నిర్వహించామని, గణపతి నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని, ట్రాఫిక్ నియమాలు పాటించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడరాదని సూచించారు. సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, అద్దెదారుల ఎంక్వైరీ, రాత్రి వేళల్లో అనవసరంగా తిరగకపోవడం, ఈవ్‌టీజింగ్, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మావల సీఐ కర్ర స్వామి, పట్టణ సీఐలు బి సునీల్ కుమార్, కె నాగరాజు, కె ఫణిదర్, ప్రేమ్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్ఐలు, ఏఎస్ఐలు, హెడ్ కానిస్టేబుల్స్, రిజర్వ్, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.
Recent Comments