రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ – క్రైమ్ : ఆదిలాబాద్ పట్టణంలో ఈనెల 8వ తేదీన మహిళ యాచకురాలిపై అత్యాచారం, దోపిడీ, హత్యాయత్నానికి పాల్పడిన గుడిహత్నూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన కూలీ పని చేసుకునే నిందితుడు మాడవి నగేష్ @ నాగోరావు @ నాగేశ్వర్ (25) ను పోలీసులు అరెస్ట్ చేశారు.
పోలీసులు సోమవారం రోజు ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరానికి పాల్పడిన విషయం ధృవీకరించబడిందనీ తెలిపారు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచనల మేరకు ఎలాంటి ఆధారాలు లేకున్నా ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి, మహారాష్ట్ర-తెలంగాణ రాష్ట్రాల 40 పోలీస్ స్టేషన్లలో గాలింపు చేపట్టగా, ఈరోజు నిందితుడు పట్టుబడ్డాడు.
నిందితుడు మూడు సంవత్సరాల క్రితం భార్య నుండి విడిపోయి ఆదిలాబాద్‌లో కూలీగా పనిచేస్తున్నాడు. ఆగస్టు 8వ తేదీ రాత్రి మద్యం సేవించి కామావేశంతో మహిళపై అత్యాచారం చేసి, దాడి చేయగా ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఆమె వద్ద నుంచి రూ.300 దోచుకున్నాడు. తర్వాత రైల్వే స్టేషన్ ద్వారా పర్లి వైద్యనాథ్ ట్రైన్ మార్గంలో పారిపోయినట్లు పోలీసులు తెలిపారు.
నిందితుడిపై హత్యాయత్నం, అత్యాచారం, దోపిడీ కేసులు నమోదు చేశారు.
ఈ కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన ఆదిలాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి. సునీల్ కుమార్, సిబ్బంది కైసర్ ఏఎస్ఐ, కానిస్టేబుల్స్ అశోక్, కరీం, రుక్మారెడ్డి, హనుమంతులు ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించారు.
Discover more from republichindustan.in
Subscribe to get the latest posts sent to your email.
Recent Comments