రిపబ్లిక్ హిందుస్థాన్, ఆదిలాబాద్ : హ*త్య కేసులో ప్రత్యక్ష సాక్షి అయిన తనను నిందితుడు బెదిరించినట్లు ఆదివారం రోజున షేక్ మొహమ్మద్ అలీ అనే వ్యక్తి ఇచ్చోడ పోలీస్ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.
తాను Cr.No.230/2023 హత్య కేసులో ప్రత్యక్ష సాక్షి కావడంతో, తాను సాక్ష్యం ఇస్తే నిందితుడికి శిక్ష పడుతుందని తెలుసుకున్న వనాలే పాండురంగ్ అనే వ్యక్తి తన ఇంటికి వచ్చి “నువ్వు సాక్ష్యం ఇస్తే నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపేస్తాను” అని బెదిరించాడని తెలిపారు.
ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి 18-08-2025 న రిమాండ్‌కు తరలించారు.
ప్రత్యక్ష సాక్షులను ఎవరు బెదిరించినా లేదా ప్రలోభ పెట్టినా వారిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపిస్తామని ఇచ్చోడ సీఐ బి. రాజు తెలిపారు.
Recent Comments